Narsipatnam: గొలుగొండలో వైసీపీ, టీడీపీల నుంచి జనసేనలో వలసలు

• క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారిస్తామంటూ ప్రతిన

విశాఖ జిల్లా, నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలతో పాటు వివిధ పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు సైతం జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి జనసేనలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ రాజన్న వీర సూర్యచంద్ర సమక్షంలో స్థానిక పప్పుచెట్టుపాలెం, మల్లవరం, జోగంపేట, గొలుగొండ గ్రామాల నుంచి 100 మంది వైసీపీ, టీడీపీల నుంచి జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరుకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని, పార్టీ సిద్ధాంతాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా శ్రీ సూర్యచంద్ర సూచించారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైన ప్రతి కార్యకర్త క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయి సమస్యలపై పోరాటానికి కదలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు శ్రీ వూడి చక్రవర్తి, శ్రీ రేగుపండ్ల శివ, శ్రీ గెడ్డ దొరబాబు, శ్రీ సఖిరెడ్డి మణిబాబు, టౌన్ అధ్యక్షుడు శ్రీ అద్దేపల్లి గణేష్, శ్రీ ఎర్ర ఈశ్వరరావు, శ్రీ వెంకటరమణ, శ్రీ గణపతి శివ గణేష్, శ్రీ ఉమా మహేష్, శ్రీ వాసం వెంకటేష్, శ్రీ గొర్రెపాటి లవ బాబు, శ్రీ ఎస్. ప్రసాద్, శ్రీ కె. ప్రసాద్, ఎల్. సత్యనారాయణ, శ్రీ బంగారు భాస్కర్ అయ్యప్ప, శ్రీ బాలాజీ పసుపులేటి, శ్రీ దుంపలపూడి శివ, శ్రీ పాతాళ శివ, శ్రీ గిర్ని నాగేశ్వరరావు, శ్రీ రవి, శ్రీ కొట్టేసాయి, శ్రీ పవన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.