“కెనడా జనసేన టీం”కు అభినందనలు

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా, పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ జనసేన వేదిక ద్వారా ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న “కెనడా జనసేన టీం”కు పేరు పేరునా ప్రత్యేక అభినందనలు అంటూ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు అన్నారు. సోమవారం “జూమ్ కాల్”లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కెనడా జనసైనికులతో మాట్లాడడం సంతోషంగా ఉంది. 2019 ఎన్నికల సమయంలో కెనడా జనసేన టీం పార్టీకి అందించిన సేవలు, పర్యావరణ పరిరక్షణ కోసం జనసేన వేదికగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహణ,”జనసేన రైతు భరోసా”, “నా సేన కోసం-నా వంతు” కార్యక్రమానికి , “ఇప్పటం గ్రామానికి” అండగా చేసిన సహాయం జనసేన పార్టీ ఎప్పటికీ మరువదు. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న రాజకీయ, సామాజిక స్థితగతులపై మీరంతా దృష్టి పెడుతున్న విధానం, జనసేన పార్టీ భవిష్యత్ కార్య కలాపాలకు చేయూతగా “కెనడా జనసేన టీం” సంసిద్ధం అవుతున్న తీరు ప్రశంసనీయం అని కె. నాగబాబు పేర్కొన్నారు.