అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమానికి జనసేన సిద్ధం: రామ శ్రీనివాస్

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో 4వ రోజు చేపట్టిన రిలే నిరాహారదీక్ష కు మద్దతుగా శిబిరాన్ని ఉద్దేశించి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన స్థానం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెంటర్ గా మరియు చుట్టూ నిత్యం రద్దీగా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రదేశం అని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేద ప్రజలందరి మద్దతు కూడగట్టుకొని రాష్ట్ర మరియు జిల్లా వ్యాప్తంగా మండలాల వారిగా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని అలానే స్థానిక శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చొరవతోనే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినట్లుగా ప్రజలందరూ అనుకుంటున్నారని ఇప్పటికైనా భారత రాజ్యాంగ పరంగా అత్యధిక శాతం మంది ప్రజలు ఓటు హక్కు ద్వారా అప్పచెప్పిన బాధ్యతను గుర్తెరిగి ఇప్పటికైనా రాయచోటి శాసనసభ్యులు చొరవ తీసుకుని బాధ్యత వహించి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన స్థానంలోనే స్థాపించాలని డిమాండ్ చేశారు. అలా స్థాపించని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఉదృతం చేస్తామని జనసేన పార్టీ తరపున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జె ఏ సి నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు, వివిధ మాధ్యమాల నేతలు పాల్గొన్నారు.