ఎస్సీ, ఎస్టీలకు జనసేన అండగా ఉంటుంది: కనపర్తి మనోజ్ కుమార్

  • 2024లో పొన్నలూరులో వైసీపీకి ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెబుతారు
  • పాదయాత్రకు సంఘీభావం తెలిపిన గోచిపాతల మోషే, గట్టిబోయిన మల్లికార్జున యాదవ్
  • పొన్నలూరులో వైసీపీకి దీటుగా డీ అంటే డీ అంటూ జనసేన నిలుస్తుంది
  • పొన్నలూరులో అభివృద్ధి లేకుండా, ఆమడ దూరంలో ఎస్సీ, ఎస్టీలు

కొండెపి: ఎస్సీ, ఎస్టీలకు అండగా జనసేన పోరాటం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, అగ్రహారం సెంటర్లో పొన్నలూరు మండల జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి అద్వాన స్థితిలో ఉంది, ముఖ్యంగా పొన్నలూరు మండలంలో వైసిపి ప్రభుత్వం వలన ఈరోజు ఎస్సీ ఎస్టీలు కన్నీటీమయం అయ్యారు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు, కార్పొరేషన్ నిధులు లేకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా, సరైన విద్య వసతులు లేకుండా, మెరుగైన ఆరోగ్య పరిస్థితులు చూపించకుండా, ప్రభుత్వం నుండి చట్ట ప్రకారం రావలసిన నిధులు మరియు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చేసి, కనీసం ఎస్సీ ఎస్టీ కాలనీలో సిసి రోడ్లు వేయకుండా, డ్రైనేజీలు నిర్మించకుండా, నీటి సదుపాయం కల్పించకుండా, భూమిలేని నిరుపేదలకు భూమి ఇవ్వకుండా, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని కార్పొరేషన్ చుట్టూ తిరిగిన నిధులు లేవు అని వెనక్కి పంపిస్తూ, ఎస్సీ ఎస్టీలను అమాయకులను చేసి ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుంది. పొన్నలూరు మండలంలో ఎస్సీ ఎస్టీలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, నెల్లూరు పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, అదేవిధంగా కొండపి నియోజకవర్గం టిడిపి నాయకులు గట్టిబోయిన మల్లికార్జున యాదవ్ కూడా జనసేన చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో పిల్లిపోగు పీటర్, సింగయ్య, అశోక్, సుబ్రహ్మణ్యం నాయుడు, మహబూబ్ బాషా, సుంకేశ్వరం శ్రీను, తిరుమలరెడ్డి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.