దళితులకు మద్దతుగా జనసేన పోరాటం

ప్రకాశం జిల్లాలో ఉన్న దళిత నాయకులు అందరూ మరో రెండు రోజుల్లో పొన్నలూరు పోలీస్ స్టేషన్ దగ్గర న్యాయం కోసం పోరాటం చేయడం జరుగుతుంది.

ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలంలో 12-07-2022 వ తేదీన సుంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లపు మహేంద్ర (ఎస్సీ మాల) మరియు వారి కుటుంబ సభ్యులను పక్కనే ఉన్న ముండ్లమూరివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుగురు అగ్ర కులస్తులు(చౌదరి) కొట్టి మరియు తిట్టి 25 లక్షల విలువ చేసే భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. న్యాయం కోసం పొన్నలూరు ఎస్.ఐ ని మరియు దర్శి డి.ఎస్.పి ని కలవడం జరిగింది, శుక్రవారం సాయంత్రం కొండేపి సీ.ఐ ని కూడా కలవడం జరుగుతుంది. శనివారం ఉదయం ఎస్.పి ని కూడా కలవడం జరుగుతుంది. 1977 నుండి నేటి వరకు ఆ భూమికి సంబంధించిన రికార్డులు మొత్తం నల్లపు మహేంద్ర కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంది, ఈ రెండు రోజుల్లో ముండ్లమూరివారిపాలెం గ్రామానికి చెందిన అగ్రకులస్తులపైన కేసు పెట్టకపోతే, ఎస్సీలకు న్యాయం జరగకపోతే పై స్థాయికి కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేసారు.