దెందులూరు నియోజకవర్గంలో జోరుగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

దెందులూరు నియోజకవర్గంలో జోరుగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం కొల్లేరు గ్రామాలు అయిన గుడివాకలంక, ప్రత్తికోళ్ళంక, అలాగే పెదపాడు మండలం వడ్డిగూడెం, సత్యవోలు గ్రామాలలో సభ్యత్వ నమోదు చేపట్టారు. సభ్యత్వం తీసుకున్న వారికి జనసేన పార్టీ తరపున ప్రమాద భీమా కల్పిస్తున్నారని ప్రమాదవశాత్తు ఎవరైనా కార్యకర్తలు మరణిస్తే 5 లక్షలు రూపాయలు అలాగే ఆస్పత్రిపాలైతే మెడికల్ అలవెన్సుగా 50000 రుపాయలు అందచేస్తారని సాయి శరత్ తెలిపారు.