ఇంటింటికి జనసేన కార్యాచరణ సమావేశం

తెలంగాణ, పటాన్ చెరు నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర నాయకుల సూచనలు మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలో బుధవారం నుండి మొదలవబోయే ఇంటింటికి జనసేన కార్యక్రమం గురించి నియోజకవర్గ కోఆర్డినేటర్స్ కు పటాన్ చెరు జనసేన పార్టీ ఇంచార్జ్ యడమ రాజేష్ దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీరామ్ నందికొళ్ల, యూత్ వింగ్ కో-ఆర్డినేటర్స్ లక్ష్మణ్ నందికొళ్ల, తలారి చంద్రకాంత్, స్టూడెంట్ వింగ్ కో ఆర్డినేటర్ మన్నే వినయ్ కుమార్ పాల్గొనడం జరిగింది.