చేనేత కార్మికులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట, శనివారం సిద్దవటం మండల పరిధిలోని పార్వతీపురం, ఉప్పరపల్లి గ్రామాల్లో చేనేత కార్మికుల సమస్యలను రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేనేతలకు మొండి చేయి చూపిందన్నారు. చేనేత కార్మికులను ఆదుకుంటాం అని చెప్పి నట్టేట ముంచింది. ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం తక్షణమే చేనేత కార్మికులను అన్నిరకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేసారు. 2024లో జనసేన టిడిపి కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక వారికి ఉచిత విద్య, హెల్త్ కార్డులు, ఆర్ధిక చేయుత, ముడి సరుకులు, మగ్గాల మీద సబ్సిడీ, పింక్చన్ మరియు సబ్సిడీతో కూడిన రుణాలు అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ జడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, చింతల రామకృష్ణ, కొట్టే రాజేష్, కత్తి సుబ్బరాయుడు, ఆకుల చలపతి, అబ్బిగారి గోపాల్, రామా శ్రీనివాస్, సుంకేశుల చౌడయ్య, కట్టా మల్లి, వంశీ, రవి, దాసు, పసుపులేటి కళ్యాణ్, ఆవుల రాజా, అతికారి ఐవరయ్య, దుగ్గి సుబ్బయ్య, కోనేటి హరి రాయల్, ప్రశాంత్, నవీన్, పత్తి నారాయణచిట్టే బాస్కర్, రాజా ఆచారి, శ్రీనివాసుల రెడ్డి, నివాస్, సుహీల్, కళ్యాణ్, సందీప్, వీరమహిళలు లోక, లక్ష్మీ దేవి, భారతి, గీత, సుబ్బమ్మ, వెంకట సుబ్బమ్మ, వాణి, సుజాత, ఆదిలక్ష్మి, వరలక్ష్మీ, సుకన్య తదితరులు పాల్గొన్నారు.