గాంధీనగర్ ప్రాంతంలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ సూచనలమేరకు పాల వారి వీధి, మానస పార్క్ వ్యూ అపార్ట్మెంట్, గాంధీనగర్ ప్రాంతంలో సోమవారం బండి సుజాత ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ.. అమాయకులైన దళితులని ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండీ మోసం చేస్తోందన్నారు. పేరుకి రెండు మూడు ఉన్నత పదవుల్లో పెట్టి తమ పార్టీ దళితులని ఉద్ధరించేస్తోందని ఊరంతా ప్రచారం చేసుకుంటోందనీ, కానీ మొత్తం నిర్ణయాలు, పాలనాధికారాలు తన మనుషులతో ఈ ముఖ్యమంత్రి నడిపిస్తున్నారన్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం దళితులకి సంబంధించిన ఒక ప్రభుత్వ సంస్థలో నియమితుడైన చైర్మన్ స్థాయి దళిత ప్రతినిధి తాను సైతం బాధితుడినే అని వాపోడం అన్నారు. కానీ ఇవేవీ తెలియక దళితులు మోసపోతున్నారనీ, అందుకే తాము దళితులను జాగ్రుతం చేస్తున్నామని తెలిపారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు.
ఈ కార్యక్రమంలో సోమాలమ్మ, జి. లక్ష్మీ, జి. రాజేశ్వరి, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, యేలేటి సోనీ ఫ్లోరెన్స్, సబ్బే దీప్తి, బోడపాటి మరియ, బట్టు లీల, మోర్తా మాలతి, రమణమ్మ, ఉమ తదితరులు పాల్గొన్నారు.