విస్సాకోడేరులో జనసేన మజ్జిగ చలివేంద్రం

భీమవరం, విస్సాకోడేరు సరిహద్దులో కోనాల సుబ్బారావు, సత్యవతిల కుమారుడు కాళీకృష్ణ, దివ్యజ్యోతి ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఉండి నియోజకవర్గ జనసేన అద్యక్షులు జుత్తిగ నాగరాజు చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ పెద్దలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ ఈ వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి ప్రయాణికులకు ఎంతో అవస్థ పడుతున్నారు. అటువంటి వారికి దాహార్తిని తీర్చడం మంచి ఆలోచన ఇలాంటి కార్యక్రమాలు జనసైనికులు ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనదం జరిగింది.