వరదలలో ప్రజలకు సహాయ సహకారాలని అందించాలని లేఖను విడుదల చేసిన జనసేనాని

వరదలలో ప్రజలకు సహాయ సహకారాలని అందించాలని లేఖను విడుదల చేసిన జనసేనాని. గోదావరి నదికి వరద ఉధృతి ప్రమాదకరస్థాయిలో ఉన్న కారణంగా కేంద్ర జల సంఘం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దతతో ఉండాలి అని, ధవళేశ్వరం దగ్గర గోదావరి జిల్లాల్లోని లంక భూములు మరియు కొన్ని గ్రామాలు నీట మునిగిపోయాయని ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం ఆందోళనలో ఉన్న విషయం నా దృష్టికి చేరినందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ జనసేన అధినేత లేఖను విడుదల చేశారు. కరోనా వ్యాధి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో వస్తున్న వరదలను ప్రత్యేక దృష్టితో చూసి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని మరియు కరోనా పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు.