సింగరాయకొండలో ఘనంగా జనసేన అధినేత జన్మదిన వేడుకలు

కొండేపి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సింగరాయకొండ మండలంలో ఎంతో ఘనంగా నిర్వహించిన మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్. శనివారం ఉదయం పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రతేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద భారీ కేక్ కటింగ్ జరిగినది. అనంతరం పూళ్ళపాలెం గ్రామంలో జనసేన నాయకులు కన్నా బ్రహ్మయ్య, కోళ్ల వెంకటేశ్వర్లు, అచ్చకాల హరి, కందుల గోపి, ఆహ్వానం మేరకు పూళ్ళపాలెం గ్రామంలో భారీ కేక్ కటింగ్ చేసిన మండల కమిటీ నాయకులు. మరియు జనసేన కిట్లు పంపిణీ చేశారు. తరువాత పేద పిల్లలకు పెన్నులు పుస్తకాలు స్కేలు పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల కమిటీ నాయకులు ఉపాధ్యక్షులు సయ్యద్ చాన్ భాష, అధికార ప్రతినిధి సంకే నాగరాజు, ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, కార్యదర్శులు అనుమల శెట్టి కిరణ్ బాబు, కిచ్చెం శెట్టి ప్రవీణ్ కుమార్, గుంటుపల్లి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిలు తగరం రాజు, షేక్ సుల్తాన్ భాష, కమిటీ సభ్యులు కూతల శ్రీనివాస్, వాయల అనీల్, సయ్యద్ సుభాని, చేవురి అరుణ్ కుమార్, మధు, ప్రసాద్, రాంబాబు, దుర్గ, జనసైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.