పాడేరు జనసేన పార్టీలో చేరిన గడ్డంపుట్టు గ్రామ యువత

  • డా. వంపూరు గంగులయ్య పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్
  • తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వ స్పందన శూన్యం
  • సాగునీటికి పుష్కలంగా అవకాశం వున్నా ప్రభుత్వం స్పందన శూన్యం. పండే పంటలు దిగుబడి అద్వానం ఫలితంగా యువత వలస పోతున్నారు మా బాధలు వర్ణానానీతం
  • అందుకే ప్రశ్నించి ఫలితం సాధించాలంటే జనసేన పార్టీ మాత్రమే సరైన మార్గమని భావిస్తున్నాం.. గడ్డంపుట్టు గ్రామ యువత

పాడేరు: జనసేన పార్టీ నాయకులు గురువారం గడ్డంపుట్టు గ్రామస్తులతో సమావేశమయ్యారు. జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్నా ప్రధాన సమస్యలైన త్రాగునీటి, సాగునీటి సమస్యల విషయం అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం నుంచి సమస్యలకు పరిస్కారం ఆశించడం కంటే గిరిజన ప్రజానీకానికి ఏ నష్టం జరగని ప్రకటన చేయకుండా ఉంటే చాలని మనకు మనం సర్దిపుచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలకు దిక్కులేదు ఇక మన గిరిజనులకు ఏ మంచి చేస్తారు. మన హక్కులు, చట్టాలు నిర్వీర్యం చేస్తూ వికట్టహాసం చేస్తున్న మన గిరిజన ప్రజాప్రతినిధులు డంక బజాయించి తాళాలు కొడుతూ భజనతో గిరిజన ప్రజలకు మభ్యపెడుతూనే వున్నారు. అనేక సమస్యలు ఈ రోజు గిరిజన గ్రామాల్లో తాండవిస్తున్న మన ప్రజాప్రతినిధులు ఎవరికి ఎంపీ టికెట్, ఎవరికి ఎమ్మెల్యే టికెట్ అంటూ లెక్కలు కడుతూ కాలక్షేపం చేస్తున్నారు. చూస్తుంటే ప్రజాపాలన పక్కనపెట్టి ఎన్నికలు, టికెట్లు పంపిణీయే వారికిఎక్కువ ఉత్కంఠగా వుందేమోనన్నారు. గిరిజన జాతికి రక్షణ గా నిలచాల్సిన బాధ్యతగల పదవుల్లో ఉన్న మన నాయకులు గత ఎస్టీ కమిషన్ చైర్మన్, కుంభరవిబాబు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొనసాగుతున్న ప్రస్తుత వైసీపీ ఇన్చార్జ్ మత్స్యరాస విశేశ్వర్రాజు, మిగతా సభ్యులు, ఎమ్మెల్యే భాగ్యాలక్ష్మిగారు, ఎంపీ మాధవిగారు కేవలం పదవుల కోసమే గిరిజన ప్రజలను మభ్యపెడుతున్నారా? గిరిజన నాయకుల సంతకాలు లేకుండా ఎస్టీ జాబితాలో బోయవాల్మీకి కులాలను చేర్చేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చెయ్యగలదా? పార్లమెంట్ లో ప్రతిపాదన చేయగలదా? కంచె చేను మెసే రాజకీయాలు చేస్తున్నది వైసీపీ గిరిజన నేతలు కాదా? వైసీపీలో ఉన్న ముఖ్యమైన నేతలకు తెలియకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం తమకు రానున్న ఎన్నికల్లో టికెట్ల పంపిణీకి ముందస్తుగానే ముఖ్యమంత్రి గారి దగ్గర గిరిజన బ్రతుకులు, రిజర్వేషన్, హక్కులు, చట్టాలు వంటి అనేక ప్రభావితమైన అంశాలను గిరిజన అస్తిత్వాన్ని తాకట్టు పెట్టేరా? లేకా బోయవాల్మీకి బెంతోరియా కుల పెద్దల నుంచి మన గిరిజన వైసీపీ నాయకులకు సూటు కేసులు ముట్టిందా? ఈ పాపానికి ప్రభుత్వం వాటా ఎంతా? అయితే రాజ్యాంగ బద్దంగా ఒక ఆదివాసీ సమూహానికి కల్పించబడిన హక్కులు, చట్టాలు ఎవరి రాజకీయాలకు వారు యధేచ్చగా వాడుకునే అంశమా? మన సంస్కృతి, ఆచారాలు, భిన్నభాష వైవిధ్యం, జీవన శైలి, ఆచార సంప్రదాయ వ్యవహారాల, సాంఘిక, ఆర్థిక, విద్య, రాజకీయాభివృద్ది ఇటువంటి అంశాలను మన గిరిజన వైసీపీ నేతలు పట్టించుకోరా?లేదంటే వాటి గురించి తెలియదా?అసలు పోతే పోయింది మాకేంటనే ఉదాసీనత ఉందా? ఇది గిరిజ ప్రజానీకానికి, వైసీపీ ప్రజాప్రతినిధులకు మా సూటి ప్రశ్న? ఇటువంటి సూక్ష్మ రాజకీయాలు యువత తెలుసుకోవాల్సిన సమయమిదే? కనీసం ఒక గ్రామానికి ఒక యువకుడైన తెలుసుకోవాలి లేదంటే గిరిజన అస్తిత్వం మన నాయకుల చేజేతులారా వారి అధికార దాహానికి తాకట్టు పెట్టె ముడి సరుకుగా మారిపోవడం ఖాయం. భవిష్యత్ తరాల విషయం ఆగమ్య గోచరం అవుతుందన్నారు. అయితే గిరిజన బ్రతుకులు తమ అధికార దాహానికి తాకట్టు పెట్టైన ఉండాలి లేదంటే సూటుకేసులైన పుచ్చుకుని ఉండాలి రెండు లేదంటే నమ్మడానికి గిరిజనులు గొర్రెలైన కావాలి. మేము ఇవాళ జనసేనపార్టీ తరుపున గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని అనేకాంశాలపై వైసీపీ నాయకులకు సవాల్ చేస్తున్నాం ఎమ్మెల్యే, ఎంపి, మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ సభ్యులు, తదితర నాయకులెవరైన గిరిజన ప్రజలు, ప్రజా సంఘాలు, పాత్రికేయుల సమక్షంలో ప్రత్యక్ష డిబేట్ కి రాగలరా?మేము గిరిజన ద్రోహులని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. గిరిజన ప్రజలందరూ ఈ అంశంపై శిత్తశుద్దితో తమవంతు బాధ్యతగా ఆలోచన చెయ్యాలి. నిజంగా గిరిజన జాతి ఈ విషయాన్ని ఆలోచిస్తే వైసీపీ ఈ ప్రాంతం నుంచి నామరూపాలు లేకుండా పోతుంది. రానున్న ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తు కావడం తధ్యమన్నారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ ఆశయాలు, లక్ష్యాలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులపట్ల ఆలోచన విధానాన్ని తెలియజేసారు గిరిజన సాధికారత విషయమై ఆలోసించిన గడ్డం పుట్టు గ్రామస్తులు భారీఎత్తున జనసేనపార్టీ లో చేరారు వారికి డా. గంగులయ్య కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో ప్రధాన భూమిక పోషించిన సుర్ల సుమన్ ఉపాధ్యక్షులు పాడేరు, ముదిలి సుబ్బారావు, తదితర నాయకులకు అభినందించారు. ప్రశాంత్, భూషణ్, రాజారావు, సురేష్, భూపాల్, అశోక్, సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు.