వై.యస్ జగన్ పై జనసేన నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని పదే పదే విమర్శించటాన్ని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ తీవ్రంగా ఖండిచారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనటంతో ప్రభుత్వానికి వణుకుపుట్టి పవన్ కళ్యాణ్ని దత్త పుత్రుడు అంటూ విమర్శించటం జగన్ పరిపాలన చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. జగన్ సీబీఐకు దత్తపుత్రుడు, చంచల్ గూడ షటిల్ బ్యాచ్ కాదా తెలపాలన్నారు. జైల్లో నుంచే సూట్ కేస్ కంపెనీలు నడిపిస్తూ, బెంగుళూరులో ప్యాలస్ లో అవినీతి, తండ్రి పదవి అడ్డంపెట్టుకుని సంపాదించిన ధనం అవినీతి సొమ్మని ఇవన్నీ వాస్తవం కాదా అని వై.శ్రీను ప్రశ్నించారు. మూడేళ్ళ నుంచి తాడేపల్లి ప్యాలస్ లో వీడియో గేమ్ లు అడుకుంటున్న జగన్ జనసేన ఆవిర్భావసభ చూసి వణికిపోయి తన ఎమ్మెల్యే, మంత్రులతో అత్యవసర మీటింగ్ పెట్టి గడపగడపకు వెళ్ళమని ఆదేశించారు. జగన్ను సైతం తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు తీసుకువచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దే అని తెలిపారు. గడపగడపకు వెళుతున్న ఎమ్మెల్యే లను, మంత్రులను ప్రజలు చీధరిస్తున్న మాట వాస్తవం కాదా తెలపాలన్నారు. కౌలు రైతులు రాష్ర్టం ఎవరూ చనిపోలేదు అనటం జగన్ పరిపక్వతకు నిదర్శనం, పవన్ కళ్యాణ్ తన కష్ఠార్జితం కౌలు రైతులకు పంచుతూ రైతుల కన్నీరు తుడవటాన్ని తట్టుకోలేని జగన్ ఈ విధంగా మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు. రాజమండ్రి ఎంపి భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మొన్నటి వరకూ మీరంటే మీరే బ్లేడ్ బ్యాచ్ లు అనుకుంటూ, ఆవ భూముల్లో అవినీతి చేసారంటూ ఎంపి భరత్ పై జక్కంపూడి రాజా విమర్శచేసారు, జక్కంపూడి రాజానే రాజానగరంలో అవినీతి చేసారంటూ ఎంపి భరత్ ఆరోపించలేదా అని వై.శ్రీనివాస్ నిలదీసారు. వీరిద్దరూ ఒకరి అవినీతిని ఒకరు బహిరంగంగా తీవ్రస్ధాయిలో విమర్శలు చేసుకుంటూ తిట్టుకుని, జగన్ మందలింపుతో బయటకు మేమిద్దంరం ఒక్కటే అంటూ కౌగిలించుకుని నటిస్తూ, ఇప్పుట నుంచి ఇద్దరం కలసి దోచుకుంటారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, వీరిద్దరిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని తెలిపారు. ఇంకోసారి వైసీపి నాయకులు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే తగిన బుద్ది చెబుతాం అంటూ వై.శ్రీనివాస్ మఖ్యమంత్రి జగన్ని, మంత్రులను, ఎమ్మెల్యే లను తీవ్రంగా హెచ్చరించారు.