సీఐ దురుసు ప్రవర్తన… జిల్లా ఎస్పీకి జనసేన ఫిర్యాదు

పెడన నియోజకవర్గ జనసేన నాయకుడు ఎస్ వి బాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, అమర్నాథ్ లపై కౌంటర్ ఇవ్వటం జరిగింది. వెంటనే పెడన సీఐ, ఎస్.వి బాబుకు ఫోన్ చేసి బెదిరించడం, నిన్ను అరెస్టు చేస్తాం అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి పోలీస్ అధికారులకు రాజకీయ నాయకులు ఇచ్చే కౌంటర్ లకు, ప్రతి కౌంటర్ల కు సంబంధం లేదు. అధికార పార్టీకి కొమ్ము కాయాలనే ఉద్దేశంతో కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి మన పెడన సిఐ వీరయ్య గౌడ్. ప్రశ్నించే గొంతును అణచివేయాలని ధోరణితో వ్యవహరిస్తున్న సదరు సీఐ పై కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయుటకు బుధవారం జనసేన నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. ఎస్పీ అందుబాటులో లేకపోవడం వల్ల డిఎస్పి ధర్మేంద్ర కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ ఇలాంటి సంఘటనలు ఇకముందు జరక్కుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మీడియాతో మాట్లాడుతూ సీఐ తన ప్రవర్తన మార్చుకుని రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని, లేని పక్షాల జనసేన పార్టీ నుండి లీగల్ గా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగలూరు శాంతి ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ బత్తిన హరి రామ్, పండమనెని శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, కూనసాని నాగబాబు జిల్లా కార్యదర్శి, ఒడుగు ప్రభాస్ రాజు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి, తిరుమని రామాంజనేయులు, వాలిశెట్టి మల్లి, మచిలీపట్నం జనసేన నాయకులు, పుల్లేటి దుర్గారావు, కూనపరెడ్డి రంగయ్య, దాసరి ఉమా సాయి, పుప్పాల సూర్యనారాయణ, ఎలవర్తి రామాంజనేయులు, కాజా మణికంఠ, పితాని సురేష్, పుప్పల పాండురంగారావు మరియు పెద్ద ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.