కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని జనసేన డిమాండ్

ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం, ములపర్రులో జనసేన గ్రామ సందర్శనలో భాగంగా పెనుగొండ మండల కమిటీ నాయకులు మందా నవీన్ ములపర్రు పర్యటించడం జరిగింది. ములపర్రు పంచాయతీ పరిధిలోని మద్దిగుంట చెరువు గ్రామంలో అంగన్వాడి కట్టి మూడు సంవత్సరాల కాలం ముగుస్తున్న ఇంకా దానినే ఓపెన్ చేసే వైనం కనబడట్లేదు. మూడు సంవత్సరాల క్రితం అంగన్వాడి కట్టారని దానికి ఇంకా తలుపులు పెట్టలేదని అదే గ్రామంలో ఒక చోట ఒక రూము అద్దెకు తీసుకుని అక్కడ అంగన్వాడి పెడుతున్నానని కనీసం ఒక పదిమంది పిల్లలు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని, పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలంటే చాలా కష్టమవుతుందని అంగన్వాడి టీచర్ మాకా మేరీ రత్నం చెప్పడం జరిగింది. తలుపులు పెడితే అంగన్వాడిలోకి వెళ్ళిపోతామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిధులు ఇచ్చి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని మంద నవీన్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ములపర్రు జనసేన నాయకులు పువ్వుల అంజిబాబు, దిగమర్తి శ్యాంబాబు, ములపర్రు జనసైనికులు పాల్గొనడం జరిగింది.