గిరిపుత్రులకు చీరలు పంపిణీ చేసిన జనసేన

దేశం స్వతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటోంది.. గిరిజనులకు మాత్రం ఈ రోజుకీ ఆర్ధిక, సామాజిక స్వతంత్రం రాలేదని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి తడ శ్రీనివాసులు స్పష్టం చేశారు. పాలకులు గిరిపుత్రులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుండడమే అందుకు కారణమన్నారు. కనీస మౌళిక వసతులకు కూడా గిరిజనులు నోచుకోని దుస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు. సత్యవేడు నియోజకవర్గం. బుచ్చినాయుడు కండ్రిగ మండల పరిధిలోని ఓ గిరిజన కాలనీలో గడప గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఆ మండలానికి చెందిన ముఖ్య నాయకులు రాఘవేంద్ర, రమేష్, కిరణ్ కుమార్ ల ఆర్ధిక సహకారంతో కాలనీలోని వృద్ద మహిళలకు పవనన్న సంక్రాంతి కానుక పేరిట చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కట్టుబడిన ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. ప్రజలు ఓటును అమ్ముకోకుండా నమ్ముకున్న రోజే అది సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం, కోదండ రామయ్య, సుగంధర్, పోలయ్య, వీరరాఘవులు, తేజ, వసంతరావు, నరసింహులు, గాంధీ, శ్యామ్, అంబ్రూత్, సునీల్, చెంచయ్య, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.