రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగల ప్రణాళిక జనసేన వద్ద ఉంది: యుగంధర్ పొన్న

  • వైభవంగా జరిగిన పదవి ప్రమాణ స్వీకారోత్సవం
  • మండల సమస్యలపై త్వరలో ప్రణాళిక సిద్ధం

గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గం ఇంచార్జి డా యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ సందర్బంగా మాటాడుతూ ఇప్పటికి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగల ప్రణాళిక జనసేన వద్ద ఉందని రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. వెదురుకుప్పం మండలంలో రైతులను నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు నుంచి విముక్తి కల్పించాలి. నకిలీ పట్టాల సృష్టికర్తలపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వెబ్ ల్యాండ్ క్రియేట్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి. తప్పుడు ఆన్ లైన్ చేసిన రెవెన్యూ సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని తెలియజేసారు. భూకబ్జాలను అరికట్టాలి. చెరువులు, కుంటలు, శ్మశానాలను ఆక్రమణ దారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. పచ్చికాపల్లంలో కార్వేటినగరం సంస్థానాదీశులు తవ్వించిన కోనేరు ఆక్రమణలకు గురై నామ రూపం లేకుండా పోయింది తెలిపారు. వెదురుకుప్పం, పచ్చికాపల్లం, మొరవ, దేవళంపేట వారపు సంతలు రోడ్లపైనే మండుటెండల్లో జరుగుతోంది. సురక్షిత ప్రాంతంలో షెడ్లు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మండల అధికారులను కోరారు. పచ్చికాపల్లంలో పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు హర్షనీయం. కానీ రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకూ భవన నిర్మాణానికి పునాది రాయి పడలేదు. కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. విద్యార్థులకు తరగతి గదులతో పాటు కనీస సౌకర్యాలు అంతంత మాత్రంగానే చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాల నడుస్తోందని విస్మయం వ్యక్తం చేశారు. వెదురుకుప్పం ఐటీఐకి సొంత భవన నిర్మాణం కలగానే మిగిలింది. ప్రస్తుతం ప్రాధమిక పాఠశాలలో శిధిల భవనం కొనసాగించడం బాధాకరని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకు వసతులు ఉన్న భవనాలు లేవు. భవన నిర్మాణాలు మొండి గోడలకే చాలా చోట్ల ఉన్నాయి తెలిపారు. గ్రామ సచివాలయాలకు చాలా చోట్ల ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని తెలియజేసారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటి యూనిట్ సొమ్ము రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ లను వినియోగంలోకి తేవాలి. సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఎంపీపీ కుర్చీలు మహిళలకు కేటాయిస్తే భర్తల పెత్తనం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలి. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం అరికట్టాలని డిమాండ్ చేశారు.
సారా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇంకా విస్తృతంగా దాడులు చేయాలని డిమాండ్ చేశారు. పచ్చికాపల్లం పీహెచ్సీలో వైద్యులు, నర్సులు అందుబాటులో లేకపోవడంతో ఫీల్డ్ స్టాఫ్ సేవలు అందిస్తున్నారు. పచ్చికాపల్లం పీహెచ్సీలో కాన్పులు, ఆపరేషన్ లు చేయడం లేదు. మొక్కుబడిగా కాన్పులు ఫీల్డ్ స్టాప్ చేయిస్తున్నారని తెలిపారు. పచ్చికాపల్లం పీహెచ్సీలో సిబ్బంది, ఓ వైద్యాధికారిణి మధ్య గొడవలు. రోగుల ముందే రచ్చ రచ్చ చేస్తున్నారని తెలిపారు. ఫైర్ స్టేషన్ మాటలకే పరిమితం. కార్యరూపంలో ఇప్పటికీ లేదని తెలియజేసారు. వెదురుకుప్పం మండలంలో అడవి జంతువులు వేటగాళ్ల తూటాలకు బలైపోతున్నాయి. వెలుగు సంఘాల్లో గ్రూపు లీడర్స్, సంఘమిత్రలు చేతివాటం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెలుగు సంఘాల్లో ఉద్యోగుల కుటుంబీకులు, లక్షాధికారి కుటుంబాల వారు ఉన్నారు. వారిని తొలగించాలని కోరారు. అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిని నిష్పక్షపాతంగా ఏరివేయాలని డిమాండ్ చేశారు. సున్నా వడ్డీ అన్ని సంఘాలకు ఇవ్వాలి. ఇంకా కొన్ని సంఘాలకు మంజూరు కాలేదు. చేపల చెరువుల వేలం పాట ద్వారా వచ్చిన డబ్బులను చాలా చోట్ల ఖజానాకు జమ చేయలేదని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. వాటర్ ట్యాంక్ లు శుభ్రం చేయడం లేదు. 108 సేవలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులపడుతున్నారని తెలిపారు. పర్యావరణానికి తూట్లు పొడిచే విధంగా చెట్లను నరికి అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారని తెలిపారు. స్పందన అర్జీలకు పరిష్కారం చూపడం లేదని తెలిపారు. వావిలిచేను, యనమలమంద సమీపంలో ప్రాజెక్టుల నిర్మాణం అని డిప్యూటీ సీఎం హామీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వెదురుకుప్పంలో మినీ స్టేడియం కలగానే మిగిలిందని,
అర్హులందరికీ నవ రత్నాలను ఇవ్వాలని తెలియ జేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి. వాటర్ ట్యాంక్ లు నిర్మించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పురుషోత్తం, గౌరవ అధ్యక్షులు మధు, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్సులు వెంకటేష్, భాను ప్రసాద్, రాఘవ, ప్రధాన కార్యదర్శులు మధు, మోహన్, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, మండలంలోని జనసైనికులు, నియోజకవర్గంలోని జనసేన నాయకులు పాల్గొన్నారు.