బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందించిన జనసేన

ప్రజల కష్టాలను తీర్చాల్సిన ప్రభుత్వమే, ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తుంది: గాదె

గుంటూరు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, నాగార్జున నగర్ లో మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఇంటిని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరపున రూపాయలు 1,00,000/- ఆర్థిక సహాయం ప్రకటించి వారిని వెంటనే సత్తెనపల్లి జనసేనపార్టీ ఆఫీస్ కి పిలిపించి వారికి చెక్కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ… పేదలకు గూడు, గుడ్డా వంటి మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వమే పేదవాడు అప్పులు చేసి కట్టుకున్న ఇల్లు కూల్చివేయడం దుర్మార్గమని, దీనికి స్థానిక మంత్రి అంబటి రాంబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గాదె మాట్లాడుతూ బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇస్తూ అధికారులు అధికార పార్టీ నేతలు ఇటువంటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ప్రజల కష్టాలను తీర్చాల్సిన ప్రభుత్వమే ప్రజలకు ఇబ్బందులు గురి చేయటం చాలా బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయుబ్ కమాల్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, తవిటి భవన్నారాయణ, సిరిగిరి శ్రీనివాస్, యర్రంశెట్టి రామకృష్ణ, సత్తెనపల్లి నియోజకవర్గ మండల జనసేన అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.