సిజి రాజశేఖర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు

పత్తికొండలో జనసేన పార్టీ నాయకులు సిజి రాజశేఖర్ ఇంటి దగ్గరకొచ్చి పూలమాలతో పాటు పండ్లు చేతికిచ్చి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ సరికొత్త లక్ష్యాలతో మనం కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించే నూతన సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. గత సంవత్సరం కలిగించిన బాధలు, కష్టాలు, నష్టాలు అన్నింటినీ ఈ కొత్త సంవత్సరంలో అధిగమించి. మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను, విజయాలను అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కష్టాలెన్ని వచ్చినా గాని, సవాళ్లెన్ని ఎదురైనా గాని, కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం. ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావాలి. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త ఆలోచనలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ప్రతి ముగింపు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి ప్రారంభం ఒక కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. ఈ నవోదయ నూతన సంవత్సరం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని ప్రతీ ఒక్కరికీ విహాంగంలా అందించి శాంతి సౌఖ్యాలను ఇంటింటా పంచి ఇచ్చే నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. అందరం ఆత్మవిశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ చిరునవ్వులను పంచాలి. మనం కొత్త అధ్యాయనాన్ని ప్రారంభింస్తున్నాము. ఈ నూతన సంవత్సరం రాష్ట్రానికి అలాగే ప్రజలకు శాంతి మరియు అత్యంత సంపదను తీసుకురావాలి. అలాగే మీ కలలను నెరవేర్చుకోవడానికి మీకు మరింత బలం చేకూరాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నానని ఈ సంవత్సరం మీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ… పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు మరియు దేశప్రజలకు, తెలుగు వారికి నా తరపున, జనసేన శ్రేణుల తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అని అన్నారు.