ఎల్లమ్మ తల్లి కొలువు వేడుకలో పాల్గొన్న తంబళ్లపల్లి రమాదేవి

నందిగామ నియోజకవర్గం: నందిగామ మండలంలోని లింగాలపాడు గ్రామంలో జాబిశెట్టి సతీష్ ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి కొలువు వేడుకకు నందిగామ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులతో మాట్లాడుతూ అక్కడి సమస్యల గురించి చర్చించడం జరిగింది. లింగాలపాడు గ్రామంలోని గ్రామస్తులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. కానీ తాగునీరు సాగునీరు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే మార్గం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని తెలియజేశారు. గ్రామంలోని నీళ్లు ట్యాంకు ఏదైతే ఉందో గత ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు కొత్త నీళ్ల ట్యాంకర్ కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ కనీసం పాత ట్యాంకు మరమ్మత్తులు కూడా చేయలేదని అక్కడికి గ్రామస్తులు తెలియజేశారు. గత నాలుగున్నర సంవత్సరాల నుండి సైడ్ కాలువలు క్లీన్ చేయకపోవడం వల్ల దోమల బెడద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, గ్రామస్థులు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ రాబోవు 2024 ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే రాష్ట్రంలోని ప్రజలందరి సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గాల దిశగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుడుపుగంటి రామారావు, టౌన్ అధ్యక్షుడు తాటిశివకృష్ణ, ఉపాధ్యక్షులు సింగంశెట్టి పవన్, కోమవరపు నరసింహస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి తెప్పలి కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి తాడిబోయిన సూర్య తేజ, కొంగర రామకృష్ణ, ముత్యం సాయిరాం, జాబిశెట్టి మధుసూదన్ రావు, ఉప్పు మధుబాబు, కొంగర హరినాథ్, మాజీ టిడిపి ఉపసర్పంచ్ ఉప్పు వెంకటేశ్వర్లు, బండి రమేష్, ముత్యం నరసింహారావు, మరియు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.