కృష్ణాపురం జలాశయాన్ని పట్టించుకోని ఉపముఖ్యమంత్రి: యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కృష్ణాపురం జలాశయాన్ని మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సందర్శించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ అతి ప్రాచీన, విశిష్టత కలిగిన కృష్ణాపురం జలాశయాన్ని ఆధునికీకరణ చేయటానికి గత ప్రభుత్వంలో విడుదలైన 33 కోట్ల జైక నిధులు ఏమయ్యాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తన సొంత మండలంలో ఉన్న ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి జైకా నిధులను తప్పుదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాపురం జలాశయాన్ని ఆధునికీకరణ చేసి ఉంటే ఎంతో అభివృద్ధి చెందేదని తెలియజేశారు. 6250 ఎకరాలు ఆయికట్టు కలిగి, 16 సిస్టం ట్యాంకులతో, జలాశయం పూర్తిగా నిండితే.35 టీఎంసీ నీళ్లు నిల్వతో, కుడి ఎడమ కాలువలు పూర్తిగా మరమ్మత్తులతో ఆధునికీకరణ జరిగి ఉంటే, ఆయకట్టుదారులు, రైతులు, లబ్ధి పొందే వారిని, కృష్ణాపురం జలాశయం పేరు మారుమోగేదని తెలిపారు. కానీ ఇది జరగకపోగా అవినీతికి పాల్పడి విశిష్టత కలిగిన జలాశయాన్ని విస్మరించటం నారాయణస్వామి ఓటమికి కారణమన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే సరికొత్త ప్రజా ప్రభుత్వంలో కృష్ణాపురం జలాశయాన్ని నియోజకవర్గంలోనే తలమానికంగా సర్వహంగులతో మరమ్మత్తులు చేసి ఆధునికీకరణ చేసి, రైతుల సర్వతో ముఖాభివృద్ధికి, నియోజకవర్గ సర్వరంగ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు నందించి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల నియోజకవర్గం తర్వాత అభివృద్ధి చెందే మూడవ నియోజకవర్గంగా చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి చామంతి సురేష్, నియోజకవర్గ యువజన కార్యదర్శి సురేష్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రా రెడ్డి, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, కార్వేటినగరం మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, నియోజకవర్గ ఇన్చార్జి సతీమణి స్రవంతి రెడ్డి, కుమార్తె కిరణ్మయి పొన్న, జనసేన నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.