ఆసుపత్రిని పరిశీలించిన జనసేన నాయకులు

  • సింగరాయకొండ మండల ప్రజల ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు.
  • ఆసుపత్రికి వైద్యులు రాకుండానే వచ్చినట్టు రికార్డ్ నమోదు.
  • ప్రభుత్వ ఆసుపత్రిలో సరయిన సదుపాయలు లేక రోగులను ప్రక్క మండలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలకు పంపిస్తున్న విధానం.

కొండెపి, జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా శనివారం సింగరాయకొండ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడం జరిగినది. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఓపి లేకపోవడం, ఆసుపత్రికి కనీసం గర్భిణీలు సైతం పోవాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కారణం కనీసం ఎక్స్రే లేకపోవటం ఆపరేషన్ థియేటర్ బాగా లేకపోవడం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం అని డాక్టర్ చైతన్య తెలియపరిచడం జరిగింది. విధి నిర్వహణలో ఉండవలసిన డాక్టర్లు, డాక్టర్ అయిన హరిత సుమారు వారం రోజుల నుంచి విధులలో లేకపోయినప్పటికీ కూడా రికార్డులో సైతం ఉన్నట్లుగా సంతకాలు పెట్టడం ఇది పరిపాటిగా జరిగిపోతున్నటువంటి విధానం. అదేవిధంగా డెంటల్ డాక్టర్ అయినటువంటి శ్రీధర్ రూమ్ కి తాళాలు వేసి ఉండటం, నర్సులు సైతం విధులు హాజరుకాకుండా హాజరైనట్లుగా రికార్డులు పొందపరుస్తున్నారు. వచ్చిన హెడ్ నర్సు వాణీ లేకుండా వారి వ్యక్తిగత పనులమీద బయటకి వెళ్లటం ఈ విషయంపై నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లు, అదేవిధంగా ఏ వార్డులో ఏ డాక్టర్ ఉంటాడో తెలియని దుస్థితి, దానికి కారణం వాటికి బోర్డ్స్ (నేమ్ ప్లేట్స్) లేకపోవడం, కనీసం బాత్రూంలో కూడా నిరుపయోగంగా ఉన్నాయి. నర్సులు సైతం వివరణ అడిగినందుకు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. పేషెంట్లకు కరెంటు వసతులు కూడా లేక ఇబ్బంది పడుతున్న పట్టించుకోకుండా డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారు మాత్రం ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నారు. దీనిపై పై అధికారులు అయిన డిహెచ్ఎంఓ రాజ్యలక్ష్మి రికార్డులు పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మీద చర్యలు తీసుకోవలెననిని జనసేన పార్టీ నుండి ప్రభుత్వాన్ని పై అధికారులను డిమాండ్ చేస్తున్నాం. మరియు అదేవిధంగా డిహెచ్ఎంఓ సింగరాయకొండ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి 30 పడకల ఆసుపత్రిగా పూర్వ వైభవం తీసుకువచ్చి 30 పడకల ఆసుపత్రిగా కావాల్సిన డాక్టర్ లను మరియు నర్సులను మరియు కావలసిన వైద్య పరికరములను ఇవ్వవలసిందిగా కోరుచున్నామని, సింగరాయకొండ మండలంలో పది పంచాయతీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు పెద్దవి మూడు ఉన్నాయి, ఫ్యాక్టరీకి వలస కార్మికులు జీవనోపాధి నిమిత్తం ఇక్కడ జీవనం కోనసాగిస్తున్నారు. అదేవిధంగా 10 గ్రామపంచాయతీలో ఎక్కువగా పేదవారు ఉండటం వలన ఈ పేద ప్రజలకు అందుబాటులో (ప్రభుత్వం) ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా పూర్తి సామర్థ్యాన్ని ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడవలెనని జనసేన పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.