పిఠాపురంలో మహాత్మునికి జనసేన నాయకుల ఘన నివాళులు

పిఠాపురం: జాతిపిత మహాత్మ గాంధీజీ జయంతి సందర్భంగా సోమవారం ఉప్పాడ బస్టాండు మరియు భీమ్ నగర్ మరియు కన్యకా పరమేశ్వరి గుడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ గాంధీ పుట్టిన దేశంలో మద్యపానం నిషేధించాలి. మహిళలు అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా ధైర్యంగా వారి ఇంటికి వెళ్తారో అప్పుడే నా దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న మాటలు గుర్తు చేసుకోక తప్పదు “ఆత్మాభిమానం, గౌరవాన్ని ఎవరో రక్షించరు.. మనకు మనమే వాటిని కాపాడుకోవాలి అని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మా గాంధీ. “సత్యం..అహింస అనే అస్త్రాలతో బ్రిటీష్ వారి బానిసత్వం నుండి భారతదేశాన్ని విడిపించిన గాంధీ స్ఫూర్తితో నేడు పోరాటం చేస్తున్నాము. అయన జీవితమే నేటి తరాలకీ ఒక స్ఫూర్తి, ఆదర్శం అని జనసేన నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబి, జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, పెంకే జగదీష్, కసిరెడ్డి నాగేశ్వరావు, కర్రి కాశీ, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, వై శ్రీనివాస్, తోట సతీష్ కోలా దుర్గ, వినకొండ అమ్మాజీ, ముప్పన రత్నం, చర్ల గీత, దేశిరెడ్డి సతీష్, పిట్టా చిన్న పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, మరియు పిఎస్ఎన్ మూర్తి పాల్గొనడం జరిగింది.