గిరిజన కాలనీలో పర్యటించిన జనసేన నాయకులు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సోమవారం వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీ పరిధిలోని లింగంగుంట గిరిజన కాలనీ నందు పర్యటించడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ లింగంగుంట గిరిజనులు గత 50 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ల కాలనీలో ఎవరైనా కాలం చెల్లితే పక్కనే ఉన్న రొంటగుంట (300 ఎకరాలకి సాగునీరు అందించే) చిన్న పాటి చెరువు లాంటిది. అ గుంటకి ఆనుకొని ఉన్న కట్టకింద ఏదైతే వీళ్ళు స్మశానంగా వాడుకునేటువంటి శివాయి స్థలం ఆ పక్కనే ఉన్నటువంటి కొంతమంది రైతులు స్మశాన స్థలాన్ని వాళ్ళ పొలాల్లో కలిపేసుకోవడం జరిగింది. ఈ విషయమై గిరిజనులతో కలిసి మండల కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అనేక సార్లు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా కానీ వాళ్ళ సమస్య మాత్రం అలాగే ఉండిపోవడం జరిగింది. మరి స్థానికులతో కలిసి సమస్యను అడిగి తీసుకోవడం జరిగింది. సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి వాళ్లకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్మశానానికి దారి చూపి, మొత్తం స్మశాన స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి వాళ్ళకి అప్పగించనీ ఎడల మేము మండల కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టడానికి కూడా వెనకాడం. పూర్తిస్థాయిలో సర్వేపల్లి పంచాయతీలో లింగంగుంట గిరిజనులకి స్మశాన స్థలానికి సంబంధించి వాళ్లకి న్యాయం జరిగేంత వరకు అండగా ఉండి సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్, శ్రీహరి, రహమాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.