కాపులకి సీఎం క్షమాపణ చెప్పాలి: సుంకర కృష్ణవేణి

దత్తపుత్రుడు హోల్ సేల్ గా కాపు ఓట్లని అమ్మేస్తాడు అని మీటింగ్ లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలని ఖండించిన సుంకర కృష్ణవేణి కాపులని అవమానించేలా, వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం పై బాధని వ్యక్తం చేసారు… జగన్ గారు ముందు ఎప్పుడన్నా ఇలాగే ఆయా నాయకుల దగ్గర గుంపగుత్తాగా ఓట్లు కొనుక్కుని ముఖ్యమంత్రి అయ్యారా? లేక వారి రెడ్ల ఓట్లు గుంప గుత్తగా ఎవరికైనా అమ్మేసుకున్నారా? అని నిలదీశారు.. కాపులను అమ్ముడు పోయే వ్యక్తులుగా చూస్తూ అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే వ్యాక్యాలు వెనక్కి తీసుకుని, కాపులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు..
కాపుల కు ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండువేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీ నీ గుర్తు చేస్తూ 3 సంవత్సారాలగా 6 వేల కోట్లు ఎక్కడా అని నిలదీశారు.

జగన్ మోహన్ రెడ్డికి తప్పని కాపుల రిజర్వేషన్ కేంద్రం మా పరిధిలోలేదు అది రాష్ట్ర పరిధిలోనిది అన్నా వైసీపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ ప్రక్కన ఎందుకు పెట్టిందని, కాపునేస్తంలో 46వేలమంది లిస్టు ఎందుకు గల్లంతయ్యిందని, అర్హులను ఎందుకు తొలగిస్తూన్నరని, అలాగే గాలి పార్టీ అధినేత గాల్లో వచ్చి, గాలి మాటలు మాట్లొడోద్దని హితవు పలికారు. మీరు మీటింగులు పెట్టుకుంటే మా ఇంటి ముందు ఎందుకు పోలీసువారిని కాపలా పెడుతున్నారని, మేము ఆర్డిక నేరస్తూలమో, జైలుకెళ్లి వచ్చిన వ్యక్తులం కాదని, శుక్రవారం మేము గుడికి వెళ్లడం కూడా తప్పా అని ఎద్దెవా చేసారు.