గొడుగుమామిడి గ్రామాన్ని సందర్శించిన జనసేన నాయకులు

పాడేరు: తాజంగి పంచాయితీ గొడుగుమామిడి గ్రామస్తుల పిలుపు మేరకు ఆ గ్రామాన్ని ఆ గ్రామాన్ని జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్బంగా వారితో సమావేశమై స్థానిక సమస్యలైన త్రాగునీటి వ్యవస్థ, అంగన్ వాడి బిల్డింగ్ సమస్యపై వారు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని జనసేనపార్టీ నాయకులకు కోరారు. ముక్యంగా ఉల్లిసీతరామ్ మాట్లాడుతూ అనేక సమస్యలతో గిరిజనపల్లెలు సతమతమవుతుందని గ్రామసీమల అభివృధ్ధికోసం వెచ్చించే నిధులు బొక్కిన వైసీపీ ప్రబుత్వం ఇలాగే గ్రామలను సమస్యల్లో నెట్టేస్తుందే తప్పితే అభివృద్ధి చెయ్యదు, అభివృద్ధి చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాదు ఎందుకంటే దోచుకునే తత్వం ప్రధాన సిద్ధాంతం కలిగినదే వైసీపీ ప్రభుత్వమన్నారు ఆనాడు బ్రిటీషర్స్ మనదేశాన్ని దోచుకుంటే ఈ నాడు వైసీపీ ప్రభుత్వమని బ్రిటిష్ వారసులు మనల్ని ఇప్పుడు దోచుకుంటున్నారన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ రాష్ట్రానికి దశ దిశ చూపించే సత్తా శక్తి ఉన్న నేత కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు అలాగే గిరిజన సాధికారత పై మన జీవన శైలి, మన ఆస్తిత్వంపై సంపూర్ణ అవగాహన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనన్నారు దయచేసి గిరిజన ప్రజలు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇచ్చి జనసేనపార్టీ కి ఓటు వేయాలన్నారు. జి.మాడుగుల మండల నాయకులు మసాడి సింహాచలం మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గంలో కచ్చితంగా జనసేనపార్టీ వస్తుందని గిరిజన ప్రాంతానికి రానున్న రోజుల్లో మంచి జరగబోతుందన్నారు అందుకు మనం మన గిరిజన సమస్యలపై పోరాడాలి మన ఆస్తిత్వంపై దాడులు చేసి రాక్షసానందాన్ని పొందే వికృత రాజకీయాల వల్ల గిరిజనులకు రక్షణగా ఉన్న అనేక జీవోలు, హక్కులు, చట్టాలు, కళ్లెదుటే కోల్పోయామని చదువుకున్న యువత జనసేనపార్టీ కి ఒక అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, గిరిజనప్రజాలపై జనసేనపార్టీ నిర్దిష్ట ప్రణాళికలపై, ఆశయాలు నచ్చి గొడుగుమామిడి గ్రామస్తులు జనసేనపార్టీ నాయకులు ఉల్లి సీతారామ్, కిల్లో రాజన్, మసాడి సింహాచలం ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగ ఆహ్వానించారు. ఈ సమావేశంలో రమేష్ తాంగుల, భానుప్రసాద్ కొర్ర, సాయి వనబరింగి, పండ్ర వెంకీ. భరత్ తదితర జనసైనికులు గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.