టెక్కలి పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన జనసేన నాయకులు

రాజాం నియోజవర్గ జనసేన నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో టెక్కలి పార్టీ ఆఫీస్ సందర్శించడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం దువ్వాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పార్టీ ఆఫీసు దాడినితీవ్రంగా ఖండించారు. అదేవిధంగా టెక్కలి జనసేన నాయకులుకు కణితి కిరణ్ కి సంఘీభావం తెలియజేశారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వం మితిమీరిన పోకడలను ఆపుకోవాలని లేనిపక్షంలో జనసేన పార్టీ జనసైనికులు రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్తారని తెలియజేశారు. రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ చేయాలి గాని, దాడులు చేయడం అనేది అత్యంత అప్రజాస్వామ్యక చర్యగా పరిగణించారు. ఇంత దారుణంగా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ ను విలువైన వస్తువులను పాడుచేసి దొంగిలించారు తెలియజేశారు. చివరికి వైసిపి ప్రభుత్వం పార్టీ గుర్తు అయినటువంటి ఫ్యాన్లు కూడా పాడు చేశారని తెలియజేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, మీ పార్టీ గుర్తు అయిన ఫ్యాను ఈ విధంగానే పాడైపోతుందని పార్టీ భూస్థాపితం చెందుతుందని హెచ్చరించారు. ఆమదాలవలస జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయాలపై దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. అలాగే రాజకీయంగా విమర్శలు సహజమేనని కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు అలాగే జనసేన నాయకులు పై భౌతిక దాడులు సరికాదని అన్నారు. అధికార పార్టీ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నరు. ఈ కార్యక్రమంలో రాజాం జనసేన నాయకులు ఎన్ని రాజు, ఆమదాలవలస జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్, చీమల గోవిందా, హేమంత్ కుమార్, గౌరయ్య, అప్పలనాయుడు, అన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.