వనబంగి గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు

అల్లూరి సీతారామరాజు జిల్లా శనివారం పెదబయలు మండలం వనబంగి పంచాయితీ వనబంగి గ్రామంలో ప్రతి ఇంటింటా సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ పెద్దలతో ఓటు హక్కు యొక్క విలువ, గిరిజన సమస్యలైన చట్టాలు, హక్కులు ఉల్లంఘన వంటి పలు అంశాలపై వివరిస్తూ, ఆదివాసీ వృద్ధ మహిళలు, తాతల యొక్క ప్రధాన సమస్యలైన రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పింఛన్ కార్డ్ లేనటువంటి వృద్ధులకు ఎలా పెన్షన్, రేషన్, పొందాలనే అంశాలను వివరించారు. అలాగే పెన్షన్ గాని, రేషన్ గాని పొందడానికి మనం అర్హులు ఎందుకంటే అది మనహాక్కు అంటూ తెలిపారు. మీరందరు పెద్దవాళ్ళు మనదేశం ప్రజాస్వామ్యదేశం ఈ దేశంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంది. అభివృద్ధి ఫలాలు అందరికి అందేలా చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత కానీ ఇవాళ వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, మీలాంటి నిరాక్ష్యరాస్యులు, అమాయకులను, సానుభూతి మాయమాటలు చెప్పి ఓటు వేయించుకుని గెలిచి ముఖం చాటేసిన నాయకులను ఎందరినో చూసాం. ఒక్కసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు. నిజాయితీగా రాజకీయాలు చేసే పార్టీలు కనుమరుగవుతున్న సమయంలో ఎంతో విలువైన సమయాన్ని, సంపదలను వదులుకుని రాజకీయాలను, ప్రజల స్థితిగతులను మార్చాలని బలమైన సంకల్పంతో వచ్చిన నేత పవన్ కళ్యాణ్ ని ఓటువేసి గెలిపించాల్సిందిగా మీ వంటి పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ శనివారం వనబంగి గ్రామంలో ఇంటింటా సందర్శిస్తూ ఆదివాసీ వృద్దమహిళలకు, తాతయ్యలకు తెలిపారు.