మహిళా సమస్యపై కార్యదర్శికి జనసేన వినతిపత్రం

కొండెపి, సింగరాయకొండ హనుమాన్ నగర్ కు చెందిన కుంచాల లత భర్త రమణయ్య గత 30 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ లో తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. కానీ 30 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ లో ఉన్నప్పటికీ నాలుగైదు ప్రభుత్వాలు మారిన అభివృద్ధి నడుచుకోవడం లేదంటూ లత జనసేన పార్టీని ఆశ్రయించింది. స్పందించిన జనసేన మండల అధ్యక్షులు ఐయినా బత్తిన రాజేష్ చొరవ తీసుకొని విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ ఇంటికి వచ్చిన వరికూటి అశోక్ బాబు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పి పట్టించుకోలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రెండు మూడు రోజుల్లో కార్యదర్శి కూడా సమస్యను పరిష్కరించకపోతే నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళకు జనసేన నాయకులు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.