నరసరావుపేట జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద ఉన్న ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలోని ఇళ్లతో పాటు టిడ్కో ఇళ్లన పరిశీలించిన జనసేన ఇంచార్జి జిలాని, జనసైనికులు, వీర మహిళలు. ఈ సందర్భంగా నరసరావుపేట జనసేన ఇంచార్జి మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం ఇల్లు పేరుతో నిరుపేదలను మోసం చేస్తోందని, వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఇరవై శాతం ఇళ్లను నిర్మించకపోవడం సిగ్గుచేటని, జగనన్న ఇల్లు నీరుపేదలకు కన్నీళ్లుగా మారాయని అన్నారు. జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి కనీస మౌళిక సదుపాయాలు కల్పించ లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జివిఎస్ ప్రసాద్. జిల్లా కార్యదర్శి అద్దేపల్లి ఆనందబాబు. వీరవల్లి వంశీ ఎస్.కె అద్రుఫ్, ఆర్కే యాదవ్, మండల అధ్యక్షులు కృష్ణంశెట్టి గోవిందు, అచ్చుల సాంబశివరావు, గోష్, గుప్తా శ్రీకాంత్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, నారదాసు వెంకటేశ్వర్లు, వల్లంశెట్టి శ్రీను, మిర్యాల సోము, వెంకటేశ్వర్లు, ఎస్.డి గౌస్, రాముడు, సంజీవరావు, శ్రీనివాసరావు, వీర మహిళలు, మల్లెపూలు దుర్గా కుమారి, మిర్యాల సుబ్బమ్మ, దాసరి శివలీల, నిర్మల మరియు అధిక సంఖ్యలో వీర మహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.