రాజశ్యామల యాగంను దర్శించిన జనసేన నేతలు

రాజానగరం నియోజకవర్గం: విశ్వశాంతి, లోకకళ్యాణం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యాధికారం చేపట్టడం కోసం, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ సంకల్పంతో చేయుచున్న శ్రీ రాజశ్యామల / రాజ మాతంగి మహాయాగం అత్యంత గంభీరమైన, ఉత్కృష్టమైన వామాచరపద్ధతిలో జరుగుతున్న భారతీయ సదాచారాలలో భాగమైన అత్యంత పురాతన, సనాతనమైన ఈ యాగం సర్వదా సర్వత్రా ఆ మహాలక్ష్మి, మహాకాళీ మహాసరస్వతి అమ్మవారి రూపమైన మహాచండీదేవీ రూపమైన శ్రీ రాజమాతంగి సప్తమాతృకా స్వరూపం నవదుర్గలలో ఒక అంశా రూపం. ఈ కార్యక్రమంలో ఆదివారం యాగశాలను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు టీడీపీ జనసేన సమన్వయ కమిటీ మెంబెర్ కందుల దుర్గేష్, పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, టీడీపీ సీనియర్ నాయకులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎక్స్ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జి ఎస్ ఎల్ హాస్పిటల్స్ చైర్మన్ గన్ని భాస్కర రావు దర్శించారు. ఈ సందర్భంగా యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా వేదిక వద్ద చిన్నారుల నృత్య ప్రదర్శన తిలకించి ఇంతటి మహోన్నత కార్యక్రమంలో మేము పాల్గొనడం మా యొక్క అదృష్టం అంటూ రాజశ్యామల యాగం చేస్తున్న బత్తుల బలరామకృష్ణ దంపతులకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని తెలియజేసారు.