జి.మాడుగులలో జనసేన మండలస్థాయి సమావేశం

పాడేరు: అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జి.మాడుగులలో జనసేన మండలస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా మండలస్థాయి నాయకులతో సమావేశమైన లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ మండల నాయకులందరు కలిసి ఏకాభిప్రాయంతో ముందడుగు వేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో భాగంగా కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్నామని, అందుకు మనమంతా కలిసికట్టుగా సమిష్టి నిర్ణయంతో క్షేత్రస్థాయి ప్రజా బాట పట్టాల్సిన అవసరముందని అన్నారు. అలాగే జనసేనాని నిర్ణయం మనందరికీ శిరోధార్యంగా భావించి మిత్రపక్షాలుతో కలిసి ఒక రాక్షస పాలనపై యుద్దానికి సిద్దమవుతున్నమని, కచ్చితంగా పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరెలా మన శక్తివంచన లేకుండా కృషి చేద్దామని అన్నారు. ఇవాళ గిరిజన గ్రామాల్లో ఏ పార్టీకి లేని ఆదరణ కేవలం జనసేన పార్టీకి మాత్రమే లభిస్తుందనే విషయం మరిచిపోవద్దని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, లక్ష్యాలకి గిరిజన యువత బ్రహ్మరథం పడుతున్నమాట మనమంతా చూస్తూనే ఉన్నామన్నారు. మండల స్థాయి నాయకులు తమ తమ బాధ్యతలను నిర్వర్తించి ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. జి.మాడుగుల మండల అధ్యక్షులు మాట్లాడుతూ కచ్చితంగా అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యడానికి మనమంతా బలంగా పని చేయాలని మనమంతా ఒక బావజాలపు బంధంతో కలిసిన మహా శక్తియని ఆ శక్తిని తక్కువ అంచనా వేసి కాకి లెక్కలు వేసే బూర్జువా విధానాల నాయకులకు మన శక్తి సామర్ధ్యాలతోనే తగిన సమదనమిద్దమని ఈ సందర్బంగా మండల నాయకులనుద్దేశించి అన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మసాడి భీమన్న, కిల్లో రాజన్ లీగల్ అడ్వైజర్, గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకటరమణ, తల్లే త్రిమూర్తి, మసాడి సింహాచలం, బూత్ కన్వీనర్ భానుప్రసాద్ కొర్ర, నాగేశ్వరరావు, సోమన్న, భీమన్న, తల్లే కృష్ణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.