ఈదర హరిబాబుని కలిసిన జనసేన మండల అధ్యక్షులు

ఒంగోలులో మాజీ శాసనసభ్యులు మరియు మాజీ జడ్పీ చైర్మన్, జనసేన నాయకులు ఈదర హరిబాబుని కొండేపి నియోజకవర్గం మండల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఈదర హరిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తూ సూచనలు సలహాలు మండల అధ్యక్షులకు ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అన్నారు. ఈదర హరిబాబుని కలిసిన వారిలో పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడ శశిభూషణ్, గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ లేటి కేశవురావు తదితరులు ఉన్నారు.