నిత్య వైద్యానికి సహాయం అందించిన జనసేన బృందం

  • మానవత్వం చాటుతున్న పొన్నలూరు మండలం జనసేన మనోజ్ కుమార్ బృందం
  • తప్పు చేస్తే ప్రశ్నించడమే కాదు ఆపదలో ఉంటే సహాయం చేయడం జనసేన సిద్ధాంతం

ప్రకాశం జిల్లాలో, కొండేపి నియోజకవర్గంలో, పొన్నలూరు మండలంలో “వేంపాడు” గ్రామానికి చెందిన మద్దిరాల హరీష్ మరియు మానస దంపతుల కుమార్తె మద్దిరాల నిత్య అనే 18 నెలల చిన్న పాప హైదరాబాదులో జులై 18-7-22 న మొదటి అంతస్తు మెట్ల మీద నుండి జారి కింద పడిపోయింది. ప్రమాదవశాత్తు మెదడులోని నరాలు దెబ్బ తిన్నవి. వారు చాలా పేదవారు. ఇప్పటికే స్నేహితుల ఆర్థిక సహాయంతో యశోద ఆసుపత్రి నందు 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దయచేసి తమ వంతు ఆర్థిక సహాయం అందజేసి, ఆ పాపకు పునర్జన్మ ను ప్రసాదించవలసిందిగా అని పాప తల్లిదండ్రులు పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ని అడగడం జరిగింది.

మనోజ్ కుమార్ వెంటనే స్పందించి వారి జనసేన మిత్ర బృందానికి తెలియజేయడం జరిగింది. వారు వారికి తోచిన సహాయం 30,000 రూపాయలు పంపించడం జరిగింది, ఇంకా సహాయం అందించేయ్ విదంగా ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్బంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ నా పిలుపు మేరకు పాపకు సహాయం అందిస్తున్న జన సైనికులందరకు ధన్యవాదాలు తెలియజేసారు.

ఫోన్ పే గూగుల్ పే నెంబర్లు. 9398990532.హరీష్ మద్దిరాల. 9346148612.నవీన్ మద్దిరాల, 63047 44119. శివ మద్దిరాలా.

ట్రీట్ మెంట్ కీ సుమారు 20 లక్షలు దాకా కర్చు అవచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు.
వారికి ఇప్పటికీ డొనేషన్స్ ద్వారా 2 లక్షలు పైన వచ్చాయి. ట్రీట్ మెంట్ కీ ఇప్పటికీ 4 లక్షలు అయ్యాయి. అంటే ఇంకా సుమారు 12,13 లక్షలు దాకా అవసరం అవుతాయి అని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు, కాబట్టి ఎవరికి తోచినంత వారు సహాయం చేసి కనీసం మానవత్వంతోటి 100 రూపాయలు సహాయం చేసినా సంతోషమే, ఈ పసి పాపకి మరో జన్మని ప్రసాదించాలని మీ అందర్నీ పేరుపేరునా ప్రార్థిస్తున్నానని జనసేన పార్టీ పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేసారు.