లచ్చయ్యపేట: చెఱకు రైతుల కోసం జనసేన పాదయాత్ర

విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని సీతానగరం నుండి లచ్చయ్యపేట వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది, ఈ పాదయాత్రలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు గారు మరియు వివిధ మండలాల మరియు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలో గల వివిధ గ్రామాల రైతులు పొలంలో ఉన్న మట్టిని ముడుపులుగా కట్టి లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముడుపుగా చెల్లించారు, ఆలయంలో రైతులు మరియు జనసేన నాయకులు చెరుకు బకాయిలు చెల్లించాలని అలాగే ఫ్యాక్టరీ నడిపే విదంగా చూడాలని స్వామి వారిని వేడుకున్నారు. అనంతరం షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో చెరుకు మొక్కలు నాటి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన నాయకులు మరియు పార్వతీపురం నియోజకవర్గం, బొబ్బిలి, కురుపాం నియోజకవర్గాల నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.