తిరుపతి దాడికి గురైన మహిళలకు జనసేన భరోసా

తిరుపతి రూరల్ నియోజకవర్గంలో పాతకాలువ పంచాయతీలో, పేరూరు గ్రామంలో మొన్న రాత్రి జరిగిన దాడి అందరికీ తెలిసినదే…
దీని మీద స్పందించి జనసేన పార్టీ నాయకులు దాడులకు గురైన వారికి అండగా నిలిచారు….

వరదనీరు విపరీతంగా వస్తున్న సందర్భంలో ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ల స్వలాభం కోసం పేరూరు నుంచి తుమ్మలగుంట, అవిలాల చెరువులకు మల్లించవలసినటువంటి నీళ్లను మొన్న రాత్రి ఎవరికి తెలియకుండా స్థానిక ప్రజలఅందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి కట్టను తెంచేసి ఆ నీరు ను పాతకాలువ, గొల్లపల్లి రామాజిపల్లి మీదుగా దారి మళ్ళించడం జరిగినది, దీంతో ఆ గ్రామాల ప్రజలలో నిర్వహిస్తున్న వారి ఇళ్లలోకి, పొలాలలోకి నీరు రావడం కరెంటు పోవడం చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొంది అక్కడ చాలా నష్టం జరిగింది దానిమీద ప్రశ్నించడంతో ఆ ఊర్లో వాళ్ళ మీద స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడు అక్కడకు చేరుకొని పోలీసులతో డిఎస్పీ గారితో వాళ్ళ పై దాడి చేయించడం వారిని నానా బూతులు తిట్టడం జరిగినది ఈ దాడిలో సరిత అనే మహిళ మీద లాఠీ చార్జి చేయడంతో ఆమె తీవ్ర గాయాలకు గురిఅయ్యి ఆసుపత్రిలోచేరి ఈరోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది, ఆమెను జనసేన పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారు, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ గారు, మరియు పట్టణ నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని అక్కడ నివసిస్తున్న బాధితులకు మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసానిచ్చి అక్కడి నుండి ఎక్కడైతే ఈ యొక్క నీరును వదలడం జరిగిందో ఆ యొక్క స్థలాలను, ఇళ్లను పరిశీలించి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చి దీనిమీద అవసరమైతే ఎంతవరకైనా పోరాడతామని చంద్రగిరి స్థానిక ఎమ్మెల్యే చేవి రెడ్డి గారి మీద న్యాయపరంగా, చట్టపరమైన తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఇదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది పెట్టడానికి ఎన్నో రకాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అనేకులు తెలియజేయడం జరిగింది, కాబట్టి వెంటనే అక్కడ ఉన్న నీరుని తుమ్మలగుంట అవిలాల చెరువు వైపు మళ్లించాలి కానీ ఎందుకు మళ్ళించడం లేదు అంటే అక్కడ వాళ్ళ సొంత గ్రౌండ్ సొంత స్థలాలలో కి నీరు చేరుకుంటుందనే ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధాకరం, వెంటనే ఆ యొక్క చెరువులో నుంచి నీళ్లను కూడా తుమ్మలగుంట వైపు తరలించాల్సిగా ప్రజల తరఫున జనసేన నాయకులు ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకు వెళతామని ప్రజలకు హామీ ఇస్తూ, అవసరమైతే ఈ సమస్య పైన ఎటువంటి పోరాటానికైనా జనసేన ఉద్యమిస్తామని ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది.