అరెస్టులకు, గృహ నిర్బంధాలకి జనసేన పార్టీ భయపడదు

  • ప్రజాస్వామ్యానికి కట్టుబడి పోలీసు వారికీ ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాం
  • రాజ్యాంగబద్ధంగానే జనసేన పోరాటం జరుగుతుంది
  • జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ కావటి మనోహర్ నాయుడు క్షమాపణ చెప్పే దాకా వదిలిపెట్టం

గుంటూరు: రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా సోమవారం గుంటూరు నగరంలో తెలుగు దేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టిన విషయం అందరికి విదితమే. అయితే ఈ సందర్భంగా గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అధికార పార్టీ అనే మదంతో బంద్ ను నిర్వీర్యం చేసేందుకు విఫలయత్నం చేసారు. వారి ఎంత ప్రయత్నించినా ఇరు పార్టీల మద్దతుతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న తరుణంలో అది జీర్ణించుకోలేక గుంటూరు మేయర్ కావడి మనోహర్ నాయుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై దుర్భాషలు ఆడడం మొదలు పెట్టారు. మీడియా సమావేశంలో కూడా తానొక మేయర్ అనే విషయాన్నీ కూడా మర్చిపోయి ప్రతిపక్ష పార్టీ అధినాయకుడు అనే మర్యాద కూడా లేకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టుకలు గురించి మాట్లాడాడు. అది చాలదన్నట్టు అరండల్ పేట పోలీస్ స్టేషన్ ఎదురుగానే జనసేన పార్టీ వీరమహిళలను దుర్భాషలాడుతూ వెంట తెచ్చుకున్న వైసీపీ రౌడీ మూకలతో జనసేన వీరమహిళలపై భౌతిక దాడులకు సైతం సిద్ధపడ్డాడు. అక్కడే ఉన్న జనసేన నాయకులు మరియు జనసైనికులందరం కలిసి వారిని అక్కడ నిలువరించాము. అక్కడే ఉన్న పోలీసు అధికారులు కూడా అధికార పార్టీ వ్యక్తులకి వర్తాసు పలుకుతూ మా ఆవేదనని పట్టించుకోలేదు. ఈ సందర్భంగా జనసేన నాయకులందరం కలిసి మీడియా మిత్రుల సమక్షంలో నిన్న సాయంత్రం వరకు మేయర్ కి సమయం ఇచ్చాం. ఆలోపల గనక శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అతను క్షమాపణ చెప్పకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాము. అధికార మదంతో విర్రవీగుతున్న మేయర్ దాన్ని పెడచెవిన పెట్టిన విషయం అర్ధమైన తరుణంలో అతని తప్పు అతనికి తెలిసేలా అందరం కలిసికట్టుగా నిరసన తెలపాలని సిద్ధమయ్యాము. ఈ తరుణంలో గత రాత్రి నుంచి మేయర్ మరియు స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వత్తిడితో పొలిసు వారు జనసేన నాయకులను, జనసైనికులను గృహ నిర్బంధాలు చేసేందుకు సిద్ధమయ్యారు. నన్ను, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని మరియు జిల్లా నాయకులను నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి మమ్మల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసు వారికి పరిస్థితిని వివరించిన మీదట మమ్ముల్ని జిల్లా పార్టీ కార్యాలయం వద్ద వదిలిపెట్టి అక్కడ మళ్ళి నిర్బందం చేసే ప్రయత్నం చేసారు. జనసేన నాయకులందరం చర్చించుకున్న పిమ్మట ఎస్ పి బంగ్లా వద్దకు వెళ్లి వారికి కంప్లైంట్ ఇవ్వడమైనది. మేము రాజ్యాంగబద్దంగా పోరాటం చేస్తున్నాము. చట్టాలని, న్యాయవ్యవస్థని జనసేన పార్టీ గౌరవిస్తుంది. ఆ గౌరవంతోనే పొలిసు వారికీ ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాం.. అలాగే ఇప్పుడు కూడా సహకరించాం. కానీ మేయర్ క్షమాపణ చెప్పే వరకు అతనిని వదిలిపెట్టం అని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.