పెద్దాపురంలో జనసేన పార్టీ టిడ్కో ఇళ్ళు జగనన్న కాలనీలో సోషల్ ఆడిట్ కార్యక్రమం

పెద్దాపురం, రాష్ట్రంలో పేదవాడికి జగనన్న ఇండ్లు పేరిట ఇచ్చిన కాలనీలు గాని ఆ కాలనీకి ఇచ్చిన భూములు గాని పూర్తి అవినీతి చోటుచేసుకుందని జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు సర్వే నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల బాబు తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోటమండలాలలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు అభిమానులు ఈ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామంలో జగనన్న ఇండ్లను సందర్శించి వాటిలో ఉన్న లోపాలను గుర్తించి లోపాలను ఫోటోలు ద్వారా వీడియో ద్వారా నమోదు చేసి వాట్సాప్ లో పంపించవలసిందిగా తుమ్మల రామస్వామి (బాబు) తెలిపారు. మండలంలో ఎన్ని గృహాలు మంజూరయ్యాయి, ఆయా గృహాలు ఇంత వరకు ఎన్ని నిర్మించారు. లబ్ది దాని పేరు పట్టా వివరాలు కూడా సేకరించాలని ఆయన అన్నారు. ఈ నెల 12, 13 తేదీలలో జనసైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తనకు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించవలసిందిగా కోరారు. జగనన్న ఇండ్ల కాలనీలు మంజూరులోప్రతి జనసైనికుడు క్షేత్రస్థాయి క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటిలో జరిగిన అవినీతిని వెలికి తీసి తనకు మెసేజ్ ని వాట్సాప్ ద్వారా తెలియపరచాలన్నారు. ఉత్తమ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలకు రాష్ట్రస్థాయిలో పార్టీకి తెలిపి, పార్టీ నిర్వహణలో నడుస్తున్న మ్యాగజైన్లో ప్రచురింపబడతాయని ఆయన వెల్లడించారు. అలాగే ఈ నెల 14వ తేదీన ప్రతి మండల స్థాయిలో దీనిపై సోషల్ ఆడిట్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర జనసేన పార్టీ పబ్లిక్ ఆడిట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ప్రతి మండల స్థాయి నివేదికను సమర్పించడం జరుగుతుందని తుమ్మల బాబు ఈ సందర్భంగా తెలిపారు. ఒక్క సెంటు భూమిలో లబ్ధిదారుడు గృహ నిర్మాణం చేసుకుంటే వారికి సరైన సమయంలో ప్రభుత్వం అందించే ఇసుక, సిమెంటు, ఐరన్ వంటివి అందటం లేదని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కృషిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు) విజ్ఞప్తి చేశారు.