జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల సారధ్యంలో సీనియర్ జనసేన నేతలు, జనసైనికులు, వీరమహిళల సారధ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12,13,14 తేదీల్లో జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమం #JaganannaMosam హాష్ ట్యాగ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే జగనన్న ఇళ్లు అనే వీళ్ళ నవరత్నాలలో ఒక రత్నం రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాంగా మారిన విషయం అందరికీ తెలుసు. ఈ రత్నం ఈ వైసిపి ఎమ్మెల్యేలకు, వైసీపీ నాయకులకు అందరికీ రత్నాలు, మణిమణిక్యాలలాగా ఉపయోగించుకుని అడ్డంగా ప్రజాసంపదను దోచుకుంటున్నారు. పేద ప్రజలకు భారీగా మోసం చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అర్థం అయ్యే విధంగా అన్ని ప్రాంతాలు ఎక్కడైతే జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు ఉన్నాయో ఈ 3 రోజులు మన రాజానగరం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ పరిస్థితులు వీడియోలు, ఫోటోల రూపంలో #JaganannaMosam అనే హాష్ టాగ్ తో మనమందరం సమిష్టిగా తెలియచేయాలి. రాష్ట్రంలో 38 లక్షల ఇళ్లు పేదలకు అందిస్తామన్న ప్రభుత్వం మొదటి విడతలో 18 లక్షల ఇళ్లు 2022 జూన్ నెల లోపు పూర్తి చేస్తామని చెప్పి, కేవలం 1.5 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదు. కనీస జీవన ప్రమాణాలు అయిన త్రాగు నీరు, డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు కల్పించడం కోసం 34 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఒక్క కాలనీలలో కూడా నిర్మాణాలు చెయ్యలేదు, ఈ ప్రజా సంపద అంతా ఎక్కడికి పోయింది. ఈ మోసాల్ని నిరసిస్తూ 12 వ తారీకు నుంచి ఉదయం 9 గంటలకు దివాన్ చెరువు గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలు, ఇంటిస్థలాలను పరిశీలించడం, అలానే రేపు మరికొన్ని గ్రామాల్లో 13 న, 14 న నియోజకవర్గంలో మరికొన్ని గ్రామాలు సందర్శించి ప్రజలందరికీ ఈ ఇళ్ళ స్థలాల్లో జరిగే మోసాలను #JaganannaMosam అనే హాష్ టాగ్ ద్వారా సమిష్టిగా, ఉధృతంగా తెలుపుదాం. ఈ కార్యక్రమాల్లో బత్తుల దంపతులతో పాటు సీనియర్ నేతలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొంటారు కావున అందరూ పై కార్యక్రమాల్లో తప్పక హాజరై, కార్యక్రమాల్ని అత్యంత విజయవంతం చేయాలై కోరడం జరిగింది.