నాడు-నేడు కార్యక్రమంపై జనసేన వినతి పత్రం

కాకినాడ సిటిలో గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు, మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ కి నాడు నేడు కార్యక్రమం మీద జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా గత నాలుగు ఏండ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతొ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామంటూ చెప్పుకుంటున్న “నాడు-నేడు” కార్యక్రమంపై వివరాలు కోరారు. ఆర్భాటంగా వై.ఎస్.ఆర్ పార్టీ ఊదరగుడుతున్న ఈ కార్యక్రమం ద్వారా కాకినాడ సిటిలో ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని అభివృద్ధి పనులు ప్రతిపాదించారు. మరి వాటిలో ఎన్నిటికి ఆమోదం ప్రభుత్వం అనుమతించింది అని, వాటిలో ఎన్నిటిని ఇప్పటివరకు పూర్తిచేసారో తెలియచేయాలని కోరారు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో దీనిబట్టే తెలుస్తుందన్నారు. ప్రచార ఆర్భాటం, ఉపాధ్యాయులపై మనసులో అక్కసు తప్ప అభివృద్ధిపై ఈ వై.సి.పి కి శ్రద్ధ లేదని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. జనసేన పార్టీ ఈ వై.సి.పి ప్రభుత్వ వైఫల్యాలను సరిచేసుకునే వరకు ప్రజల తరపున అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ ర్యాలీ రాంబాబు, సిటీ కార్యదర్శి రామారావు, వార్డు ప్రెసిడెంట్లు శ్రీమన్నారాయణ, మనోహర్ గుప్త, ఆకుల శ్రీనివాసు, జనసేన నాయకులు భగవాన్, తోట నరసింహకుమార్, అమర్, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు.