గెరికచేను పల్లె (హరిజనవాడ) స్మశానవాటిక కోసం అధికారులకు వినతిపత్రం ఇచ్చిన జనసేన

చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ సూచనలు మేరకు చంద్రగిరి నాయకులు దేవర మనోహర నేతృత్వంలో రామచంద్రపురం మండలంలోని, కమ్మ కండ్రిగ పంచాయతీలోని, గెరికచేను పల్లె హరిజనవాడలో దాదాపు 30 ఏళ్లుగా వారికి స్మశాన భూమి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. గ్రామవాసులకు సరైన స్మశాన భూమి లేనందుకారణాన చివరాకరి క్షణాల్లో చేయవలసిన కార్యక్రమాలు జరుపుటకు గ్రామస్తులు ఇబ్బందికి గురవుతున్నారు, ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్యకి పరిష్కార దిశగా ఏ ఒక్క ప్రభుత్వం అడుగులు వేయడంలేదు. ఊరు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కాలువ ఉంది, ఆ కాలువ ప్రక్కన కొంత భూమి ఉంది, ఆ భూమిని ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం గాని, ఇప్పుడున్న వై.సి.పి ప్రభుత్వం గాని, ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇవ్వలేదు, కావున ఈ సమస్యపై ద్రుష్టి సారించి తక్షణమే గెరికచేను గ్రామస్థులకు సర్వే చేసి అవసరమైనటువంటి భూమిని సమాకూర్చే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రామచంద్రాపురం మండల అధ్యక్షులు సంజీవి హరి, కిరణ్, డిల్లీ, రెడ్డప్ప, కేతన్ తదితరులు పాల్గొన్నారు.