జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలి

ఎమ్మిగనూరు, స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మండల అధికారి ప్రతినిధి రాహుల్ సాగర్ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని గత కొన్ని రోజులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించడం దురదృష్టకరం ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృశ్య ఆయనకు వచ్చే ఆదరణని చూసి ఓర్వలేని వ్యక్తులు ఏదో విధంగా ఆయనకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నిస్తున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఏదైనా జరగరానిది జరిగితే ఉపేక్షించేది లేదని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్ షబ్బీర్ ఉరుకుందు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.