వీరఘట్టం మండలంలో జనసేన నిరసన ర్యాలీ

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలంలో వాలంటీర్ల తీరును ఖండిస్తూ జనసేన పార్టీ తరుపున ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉదేశ్యం గురించి వీరఘట్టం మండల జనసేన ఎంపీటీసీ అభ్యర్థి జనసేన జానీ మాట్లాడుతూ.. వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినది ఏమిటంటే గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే ప్రతి ఒక్కరి డేటా వాలంటీర్ల చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళు వైసీపీ వాళ్లకు అందిస్తే వారి ద్వారా ఆ పార్టీలోని అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆడవారిని ఇబ్బందులు పెట్టడానికి, ఆస్తులు దోచుకోడానికి ఈ డేటా వాడుకుంటున్నారు అని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అన్నారు. ఆడపిల్లలు, మహిళలు కనపడకుండా పోవడానికి వైసీపీ నాయకుల హస్తం కూడా ఉందని కేంద్రం హెచ్చరించింది అని అన్నారు. కానీ వైసీపీ వారు చేస్తున్న ప్రచారం మాత్రం
పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను అవమానించాడు, అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు, వేధిస్తున్నారు అని అన్నాడని ప్రచారం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంకో అడుగు ముందుకువేసి వాలంటీర్లను బ్రోకర్లు అనేశాడు అని ప్రచారం చేయగా.. ఇక్కడ వాలంటీర్లు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అసలు మిమ్మలి ఎవరు చులకనగా మాట్లాడుతున్నారో తెలుసుకొండి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క వాలంటీర్ ను చులకనగా అనలేదు. మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వైసీపీ వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీ వాలంటీర్స్ జీతాలు పెంచండి అని, మీరు రోడ్ ఎక్కితే వైసీపీ వాళ్ళు మీకిచ్చిన బహుమతి ఏంటి? జగన్ రెడ్డి మీకిచ్చిన ప్రతిఫలం ఏంటి? మీది అసలు ఉద్యోగమే కాదు, ఊర్లలో ఉండి వైసీపీ పార్టీ కార్యక్రమాలు పబ్లిసిటీ చేస్తున్నందుకు మీకిచ్చే భృతి అన్నాడు. ఉన్నత చదువులు చదివిన మీ శక్తిని వాడుకుని మిమ్మల్ని ఊరికే పరిమితం చేసింది ఎవరు. ప్రతిభ ఉన్న యువతకు ఏడాదికి పది లక్షల ఆర్థిక సాయం చేసి పరిశ్రమల స్థాపన చేయిస్తా అని హామీ ఇస్తున్న నాయకుడు ఎవరు. ఒక్కసారి మీ విజ్ఞతతో ఆలోచించండి. పైగా లక్షలలో ఉండే వాలంటీర్స్ లో కొంతమంది చెయ్యకూడని పని చేస్తూ ఉన్నారు. అలాంటి వారి వలన మొత్తం మీ వాలంటీర్స్ అందరికి చెడ్డ పేరు వస్తుంది అని అన్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం తెలుసుకోండి. మీ వైస్సార్సీపీ చేత గాని తనం కూడా తెలుసుకుంటారు అని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మత్స పుండరికం, పోరెడ్డి ప్రశాంత్, జామి అనిల్, దత్తు, గోపాల్, అనిల్, ప్రేమ్ చందు, సవర గణేష్, సవర రాజేష్, ప్రణీత్ చరణ్, వినోద్ దిలీప్, చిన్నా మరియు పాలకొండ నియోజకవర్గ నాలుగు మండల జనసేన నాయుకులు, జనసైనికులు పాల్గొన్నారు.