షాదీ తోఫాపై ప్రభుత్వం పెట్టిన ఆంక్షలపై జనసేన నిరసన

  • నమ్మి గద్దెనెక్కిస్తే మా జీవితాలను ఛిద్రం చేస్తారా?
  • వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన ముస్లింలు
  • 151 సీట్లు కట్టబెట్టినందుకు మా బిడ్డలకు భవిష్యత్ లేకుండా చేస్తారా?
  • ముస్లింలు బాగుపడితే వైసీపీ నేతలు ఎందుకు చూడలేకపోతున్నారు?
  • రాజకీయంగా, సామాజికంగా ముస్లింలను ఒక పథకం ప్రకారం జగన్ రెడ్డి అణగదొక్కుతున్నారు
  • ముస్లింలపై ఎంతకింత కక్షకట్టారో అర్ధం కావటం లేదు
  • వైసీపీలో ఉన్న ముస్లిం మైనారిటీ నేతలు ఇప్పటికైనా నోరువిప్పాలి
  • చరిత్ర హీనులుగా వైసీపీ ముస్లిం నేతలు మిగిలిపోతారు
  • గద్దె నెక్కించిన మాకు ఆ గద్దెని ఎలా దించాలో కూడా తెలుసు
  • ముస్లింల ద్రోహి జగన్ డౌన్ డౌన్ అంటూ దద్దరిల్లిన గుంటూరు కలక్టరేట్ ప్రాంగణం
  • ముస్లింలకు వైసీపీ నేతలు చేస్తున్న తీరని అన్యాయంపై గళమెత్తిన జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నేతలు

వైసీపీ పార్టీని ముస్లిం, మైనారిటీలు తమది అనుకున్నారు, తమ జీవితాలతో పాటూ మా బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందిస్తారని నమ్మారు ఆ నమ్మకంతో గంప గుత్తగా తమ ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి చరిత్రలో నిలిచేలా 151 సీట్లు వైసీపీకి కట్టబెట్టారు ఇప్పుడు అదే వారి పాలిట శాపం అయింది. జగన్ ని గుండెల్లో పెట్టుకున్నందుకు ఆ గుండెల మీదే తంతున్నాడు. ముస్లిం మైనారిటీలకు అందాల్సిన సంక్షేమ పథకాలను, రాజ్యాధికారంలో దక్కాల్సిన వాటాను దూరం చేస్తూ తమ జీవన ప్రమాణాలను చిన్నాభిన్నం చేసారంటూ వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ ముస్లిం నేతలు భగ్గుమన్నారు
ముస్లింల ద్రోహి జగన్ ను గద్దె నెక్కించిన ముస్లింలకు గద్దె దింపటం ఎలాగో కూడా తెలుసంటూ నిప్పులు చెరిగారు. షాదీ కా తోఫా పధకానికి విధించిన కఠిన నిబంధనలు తక్షణమే రద్దు చేయాలి అంటూ ముస్లిం మైనారిటీల మహాధర్నా పేరిట శనివారం గుంటూరు జిల్లా కలక్టరేట్ ఎదుట జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి డౌన్ డౌన్. నమ్మించి వంచించిన జగన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో కలక్టరేట్ దద్దరిల్లింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైనారిటీ నాయకులు షేక్ నాయుబ్ కమాల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ముస్లింలు వైసీపీ పార్టీని నమ్మి 151 సీట్లు రావటంలో కీలకపాత్ర వహించారన్నారు. ముస్లింలకు ఒక్క పార్లమెంట్ సీటు ఇవ్వకపోయినా జగన్ రెడ్డి చెప్పిన మాయమాటలను గుడ్డిగా నమ్మిన ముస్లింలను నిలువునా నమ్మించి వంచించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఈ మూడన్నరేళ్లుగా నెరవేర్చలేదని మండిపడ్డారు. పేద ముస్లిం బిడ్డల పెళ్లికోసం గత ప్రభుత్వం ఇచ్చిన యాభైవేల రూపాయలకు తోడు మరో యాభైవేలు ఇస్తానంటూ ఎంతో నమ్మకంగా ఇచ్చారని ఇప్పటివరకు ఒక్క ముస్లిం బిడ్డకి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ముస్లింలు బాగుపడటం ముఖ్యమంత్రికి సుతారమూ ఇష్టం ధ్వజమెత్తారు. ముస్లింలకు జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలాంటి నేతలు ముస్లిం ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారంటూ నాయుబ్ కమాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలాని మాట్లాడుతూ ముస్లింలపై జగన్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను రాజకీయంగా, సామాజికంగా జగన్ రెడ్డి అనగదొక్కుతున్నారని, అంత పాపం ఈ ముస్లింలు ఏమి చేసారని జిలాని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైసీపీకి దళితులు, ముస్లింలు, బీసీలు వెన్నుమూకగా నిలిచారని ఇప్పుడు అదే ఆ వర్గాల పాలిట శాపంగా మారిందన్నారు. నా ముస్లింలు, నా బీసీలు, నా దళితులు అంటూ జగన్ రెడ్డి పలికిన చిలక పలుకులను నమ్మి గుండెల్లో పెట్టుకున్నా పాపానికి అధికారంలోకి రాగానే ఆ గుండెలపైనే తంతున్నాడని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేయటానికి చదువుతో ఏంపని అని మండిపడ్డారు. రాష్ట్ర శాసనసభ్యుల్లో పదవ తరగతి కూడా చదవని వారిని అనర్హులుగా ప్రకటించి ఆపైన షాదీ కా తోఫాకు ఈ నిబంధన విధించాలన్నారు. మాట తప్పం మడమ తిప్పం అంటూ ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్న వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే ఎన్ని మాటలు తప్పారో ఎన్ని మడమలు తిప్పారో లెక్కేలేదని దుయ్యబట్టారు. వైసీపీ అరాచక, అవినీతి, నమ్మకద్రోహ పాలనపై ప్రజల్లో తీవ్రఅగ్రహావేశాలు నెలకొన్నాయని రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఎవరూ ఆపలేరన్నారు. ప్రజల్లో ఆలోచన మొదలైందని గాడితప్పిన రాష్ట్రాన్ని కాపాడాలి అంటే నీతినిజాయితీ, నిబద్ధత కలిగిన నిస్వార్ధపరుడైన పవన్ కళ్యాణ్ ఒక్కడే దిక్కు అని ప్రజలు భావిస్తున్నారని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేణు గోపాలరెడ్డికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్రాణం మార్కండేయబాబు, బండారు రవికాంత్, చిల్లపల్లి శ్రీనివాస్, ఇస్లాం భేగ్, మహిళా కోఆర్డినేటర్ పార్వతి నాయుడు, కార్పొరేటర్ లు పద్మావతి, లక్ష్మీ దుర్గ, బిట్రగుంట మల్లిక, విజయలక్ష్మి, ఉప్పు వెంకట రత్తయ్య, అడపా మాణిక్యాలరావు, కిరణ్, నారదాసు ప్రసాద్, నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్, ఖాసీం సైదా, తవిటి భావన్నారాయణ, కోమలి, జ్యోతి, అనసూయ, కొర్రపాటి నాగేశ్వరరావు నాగలక్ష్మి, హరి చందన తదితరులు పాల్గొన్నారు.