దర్శి జనసేన కార్యాలయంలో ఘనంగా కొణిదెల నాగబాబు పుట్టినరోజు వేడుకలు

దర్శి, దర్శి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్‌ చేసి పార్టీ శ్రేణులకు పంచి పెట్టారు. నాగబాబు ఆయురారోగ్యాల‌తో ఉంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అండగా నిలవాలని ఆకాంక్షించారు. దర్శిలో జనసేన పార్టీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ గుండాల భారతి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్‌ కమిటీ సభ్యులు, పడమర గంగవరం వార్డు సభ్యులు పసుపులేటి చిరంజీవి, ప్రకాశం జిల్లా పోగ్రామ్ కమిటీ సభ్యులు పుప్పాల రుద్ర, ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, దర్శి టౌన్ అధ్యక్షులు చాతరాసి కొండయ్య, దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావు, కాట్రాజ్ వెంకటేశ్వర్లు, ఉప్పు అంజి, ఎస్.కె వెంకటేష్, అంకిరెడ్డి, యాదవుల వెంకటేశ్వర్లు, ఎస్.కె బాషా, పుప్పాల శ్రీకాంత్, ఎం.వెంకటయ్య, తోట వెంకీ, ఉల్లి వెంకట్, తోట రాయుడు, లోకేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.