మీడియా ప్రతినిధులతో జనసేన ఆత్మీయ సమావేశం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ రోటరీ క్లబ్ నందు నియోజకవర్గంలోని అందరి మీడియా ప్రతినిధులను ఆహ్వానించి నియోజకవర్గ ప్రజల సమస్యలను, మీడియా సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం జరిగింది. జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఏర్పడే ప్రభుత్వంలో మీడియా ప్రతినిధులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పిస్తూ, అన్ని రకాలుగా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 1)గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మించి ఇస్తామని, 2)మీడియా ప్రతినిధుల పిల్లల చదువులు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందిస్తామని. 3) ప్రతి మీడియా ప్రతినిది కుటుంబానికి ప్రభుత్వం తరఫున కార్పొరేట్ స్థాయిలో 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని. 4) నెలసరి నిత్యావసర వస్తువుల కొరకు ఫుడ్ కూపన్లు అందిస్తామని. 5) ప్రతి నెలా మీడియా సోదరులకు రవాణా సదుపాయం కోసం పెట్రోల్ ఎక్స్పెన్సేస్ ఇస్తామని
6) మీడియా ప్రతినిధుల ఇంట్లో చదువుకున్న యువతకి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా మద్దతు తెలిపి, ప్రజల గెలుపుకు పూర్తిగా సహకరించాలని ప్రతి ఒక్కరినీ కోరడం జరిగింది. సమావేశం అనంతరం వినుత గారు ప్రతి ఒక్కరికీ విందు భోజనంను స్వయంగా వడ్డించడం జరిగింది. అనంతరం జ్ఞాపికగా ప్రతి ఒక్కరికీ బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల/ పట్టణ అధ్యక్షులు దండి రాఘవయ్య, తోట గణేష్, కిరణ్ కుమార్, పేట చంద్ర శేఖర్, చిన్నతోటి నాగరాజు, భాగ్య లక్ష్మి, నాయకులు రవి కుమార్ రెడ్డి, కావలి శివకుమార్, పేట చిరంజీవి, వాకాటి బాలాజీ, రాజేష్, సురేష్, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, భాస్కర్ బాబు తదితరులు పాల్గొన్నారు.