బాధితులకు జనసేన అండగా నిలుస్తుంది: గునుకుల కిషోర్

  • పేదలకు పెత్తందారులకు యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేస్తున్నట్టు నెల్లూరులో ఫ్లెక్సీలు కట్టారు నిజంగా వైసిపి పెత్తందారుల వల్ల పేదలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు
  • కోవూరు నియోజకవర్గంలో అంగవైకల్యంతో ఉన్న అహమ్మద్ అనే మరికొందరు వ్యక్తులతో పాటు మరి మరికొంత మందికి చెందిన 30 ఎకరాల భూమిని వైసీపీ పెత్తందారులు ఆక్రమించాలని చూస్తున్నారు
  • మా తాతలు నేతులు నాకారు, మీరు మా మూతులు చూడండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కోవూరు వైసిపి నాయకులు
  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అందరం కలిసి ఈ వైసిపి పెత్తందారుల సమస్యను ఎదుర్కోవాలి.

కోవూరు నియోజకవర్గం, ముదివర్తి గ్రామంలో అంగవైకల్యంతో ఇబ్భంది పడుతున్న ఇద్దరితో పాటు, మరికొందరికి చెందిన 60 ఎకరాల భూములను బలవంతంగా తీసుకుని వారికి భూములకు సంబంధం లేదని స్థానిక వైసిపి పెత్తందారులు అజమాయిషీ చేయిస్తున్నారు. తమల్ని వారి నుంచి కాపాడాల్సిందిగా జనసేన పార్టీని ఆశ్రయించగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు సుదీర్ బద్ధిపూడి బాధితుల స్థలం వద్దకెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 50 సంవత్సరాలు పైబడి స్వాధీన అర్హత కలిగి, పన్నులను కరెంటు బిల్లును చెల్లించుకుంటున్న బాధితులకు స్థలానికి ఎందుకు సంబంధం లేదంటూ స్థానిక వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. అనేకమార్లు ఎమ్మార్వో, కలెక్టర్ ని బాధితులు కలిసినా ఉపయోగం లేకుండా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న మద్దతుతో స్థానిక నాయకులు అరాచకంగా ప్రవర్తిస్తూ భూమి మాది అంటే ఎక్కడ మనిషిని కూడా చంపేసే పరిస్థితి ఉందో ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఈ స్థలాలు విషయమై ఎదురుతిరిగిన ఒక మహిళను ఊరు నుంచి కూడా గెంటేయించారు. ఈ విషయమై వారికి న్యాయం జరిగే వరకు కూడా జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతాం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. నెల్లూరు రూరల్ లో మాకు ఈ మధ్య కొన్ని ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. దానిలో పేదలకు పెత్తందారులకు యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి మీద ఎవరో రాయి వేస్తున్నట్టు కూడా చిత్రీకరించి ఉన్నారు వైసిపి నాయకులు. ఇలా పేదలకు జరుగుతున్న అనేక అన్యాయాలు దృష్టికి వచ్చినప్పుడు ఈ మాట నిజమే అనిపిస్తుంది వైసిపి పెత్తందారులను ప్రజలందరూ కూడా కలసి ఉమ్మడిగా ఎదుర్కొని తగిన బుద్ధి చెప్పాలి. మొన్న ఈమధ్య కోవూరు నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని కోట్లకు కోట్లు శాంక్షన్ చేయించుకొని ఆ విషయం మరచి పోయారని వైసీపీ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే కొంతమంది నాయకుల తీరు ఎలా ఉందంటే.. మా తాతలు నేతులు తాగారు మీరు మా మూతులు తుడవంటి అన్నట్లుగా ఉంది వారి విషయం. ప్రస్తుత విషయాల గురించి చర్చిస్తే దశాబ్దాల కిందట పూర్తయిన తెలుగు గంగ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తారు. ఎకరానికి ఎన్ని సెంట్లు అనేది గూగుల్లో కొడితే ఇట్ట కొడితే ఎట్టా వస్తుంది కానీ మీరు చేసిన అవినీతికి లెక్కలు ఎవరిని అడిగినా చెప్పలేరు. ఎకరానికి ఎన్ని సెంట్లు అనేది గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వస్తుంది కానీ మీరు చేసిన అవినీతికి లెక్కలు ఎవరిని అడిగినా చెప్పలేరు. వచ్చిన నలుగురు ఐదుగురుమే కలిసి ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా అడ్డుకోగలిగాము. రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం జనసేన అధికారంలోకి వస్తే మీరు చేసిన దోపిడీలు మొత్తం కక్కిస్తాము. దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గెలిచిన ప్రసన్న ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకోవాల్సింది పోయి పేదలకు భూములు అన్యాయంగా లాక్కుంటుంటే వాళ్ళని ప్రోత్సహించడం అన్యాయం. పేదవారికి ఒక హాస్పిటల్ కట్టించింది లేదు, ఒక పాఠశాలను కట్టించింది లేదు. ఏమి ఉద్ధరించారని మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నారని అడిగారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షుడు సుదీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షాజహాన్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.