జనసేన జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన తీగల చంద్రశేఖర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఆదేశాలు మేరకు జనసేన జనబాట కార్యక్రమాన్ని విఘ్నేశ్వర, మహాలక్ష్మి, అభయఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేసి ప్రారంభించడం జరిగింది. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకపడ్డంతో పాటు వైసీపీ అరాచకాలను ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ విధానాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. జనబాట కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఎన్నారై డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో సమ సమాజ స్థాపన, విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడుతుందని సమాజ అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్క జనసైనికుడు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రవర్ధన్, భాస్కర్, జమాల్ బాషా, నాగార్జున, ఇమ్రాన్, విజయ్, క్రాంతి, జనర్ధన్, మణి కార్తీక్, సాయి, శివ, తనూజ, శంకర్, మోహన్, మండల నాయకులు పాల్గొన్నారు.