పొన్నలూరు మండలం వి.ఆర్.ఏలకు జనసేన మద్దతు

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే.. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసేటప్పుడు హామీలకు అడ్డు, అదుపు, హద్దు, లేకుండా అధికారం కోసం వి.ఆర్.ఏ ఉద్యోగస్తులు అందరికీ 15 వేల రూపాయలు జీతం పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నా గాని ఎక్కడైనా వి.ఆర్.ఏల గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు, మాట తప్పని మడమ తిప్పని నాయకులు అని చెప్పుకుని ఈ వైసిపి నాయకులు అందరూ ఈరోజు ఏమైపోయారు…? అధికారం కోసం తియ్యటి మాటలు చెప్పి ఈ రోజు వి.ఆర్.ఏ ఉద్యోగస్తులు అందరినీ నట్టేటముంచేశారు. ఈ వైసీపీ నాయకులకు, సలహాదారులకు మాత్రం లక్షలకు.. లక్షలు జీతాలు పెంచుకుంటూ పోతారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచరు.

“మేడిపండు చూడ మేలిమై యుండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు” అన్నట్లుగా ఈ వైసీపీ ప్రభుత్వం మాటలు, హామీలు, పథకాలు, పబ్లిసిటీలు సాక్షి పేపర్లలో, సాక్షి టీవీలో దగదగ మెరిసిపోతాయి. చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసింది. ప్రజలమీద పన్నుల రూపంలో మోయలేని భారాన్ని వేసింది. తిరుపతి శ్రీవారి దర్శనం టిక్కెట్ల రేట్లు, లడ్డు ధరలు ఇష్టమొచ్చినట్లుగా విపరీతంగా పెంచారు. ఆఖరికి కుక్కలు పెంచుకోవాలన్నా.. పందులను పెంచుకోవాలన్నా.. “పన్ను” కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి “చెత్త” మీద కూడా పన్నులు వేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వందే. వైసీపీ నాయకుల జేబులు, బ్యాంక్ బ్యాలెన్స్ లు నిండిపోతున్నాయి. ప్రజలు మాత్రం మరింత పేదరికంలోకి పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కుడిచేతితో 10 రూపాయలు ఇచ్చి, ఎడమ చేతితో 20 రూపాయలు లాగేసుకుంటున్నాడు.

(1) వీఆర్ఏలకు 21000 వేతనం ఇవ్వాలి, ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలి.
(2) ఇచ్చిన డిఎ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించాలి, డిఎ తో కూడిన వేతనం ఇవ్వాలి.
(3) నామినీలు గా పనిచేస్తున్న వారందరినీ వి.ఆర్.ఏ లుగా నియమించాలి, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి.
(4) అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి
(5) 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వి.ఆర్.ఏ ఉద్యోగస్తుల కుటుంబంలో ఖచ్చితంగా వారి ఉద్యోగం వారి కుటుంబంలో మరొకరికి ఇవ్వాలి.

పైన చెప్పిన వాటన్నిటికీ ప్రభుత్వం న్యాయం చేయాలి అని జనసేన పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. 16 రోజుల నుండి నిరసన దీక్ష కార్యక్రమం చేస్తున్న వి.ఆర్.ఏ ల అందరికీ జనసేన పార్టీ అండగా, తోడుగా ఉంటుంది మరియు వారి ఉద్యమంలో భాగస్వామి అవుతుంది. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, షేక్ ఖాజావలి, కర్ణ తిరుమల్ రెడ్డి, గడిపుడి భార్గవ్, దోరడ్ల సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీను, వెంకట్ రెడ్డి, వేణు, చందు, లక్ష్మణ్, మరియు వి.ఆర్.ఏ లు షేక్ ఇమామ్ ఖాసీం, చిన్నబ్బాయి, కోటేశ్వరరావు, శ్రీను, ప్రసాద్, చెన్నకేశవ, కొండయ్య, పూర్ణచందర్రావు, నరసింగరావు, మాధవ, మొదలైన వారు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-02-23-at-5.16.49-PM-1024x500.jpeg